ఎమ్మెల్సీ తో కలిసి సమస్యలపై కలెక్టర్ కు వినతి పత్రం

ఎమ్మెల్యే తో కలిసి పలు సమస్యలపై కలెక్టర్ కు వినతి పత్రం

1
TMedia (Telugu News) :

మండలం లో పలు సమస్యలపై కలెక్టర్ ని కలిసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మండల జడ్పీటీసీ,టిఆర్ఎస్ నాయకులు కొణిజర్ల మండలంలో* అనేక సమస్యల విషయంలో ఎమ్మెల్సీ గారితో కలిసి ఈ రోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎల్లా నగర్ గ్రామానికి ఎటువంటి నీటి వసతులు లేకపోవడం గురించి కలెక్టర్ గారి తో చర్చించి మిషన్ భగీరథ నీళ్ళు మంజూరు అయ్యే విధంగా చూడాలని కోరడం జరిగింది. అదే విధంగా మండలంలో ఫారెస్ట్ మరియు రెవెన్యూ బౌండరీల మధ్య ఉన్న సర్వే నెంబర్ మల్లుపల్లి 19, గుబ్బగుర్తి 51,75,76,343, తుమ్మలపల్లి 40,41,42,48* సమస్యలను పరిష్కరించి 350 మందికి రైతులకు న్యాయం చేయాలని కోరారు. గిరి వికాస్ కింద ఎంపికైన రైతులు ఉప్పల చిలక, గద్దల గూడెం, మల్లుపల్లి, తుమ్మలపల్లి, విక్రంనగర్, సాల బంజర, లక్ష్మీపురం, రామనర్సయ్య నగర్ , అన్నవరం గ్రామాల్లో ఫారెస్ట్ వారి సమస్యల గురించి వివరించడం జరిగింది. అన్నవరం గ్రామ పరిధిలో గల లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి, రోడ్డు నిర్మాణం గురించి ఫారెస్ట్ వారితో మాట్లాడవలసిందిగా చూడాలిని. మేకల కుంట నుండి జంపాల నగర్ వరకు ఇదివరకే శాంక్షన్ ఐనా రోడ్డు పనులు ఆగిపోవడంతో వాటి గురించి కూడా అధికారులతో మాట్లాడి పూర్తి అయ్యే విధంగా చూడాలని కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది.

also read :నేషనల్ జూనియర్ బాక్సింగ్                                                                                                              ఈ కార్యక్రమంలో కొణిజర్ల మండల జడ్పిటిసి పోట్ల కవిత , జిల్లా తెరాస నాయకులు పోట్ల శ్రీనివాస్ రావు ,మండల పార్టీ అధ్యక్షులు వై చిరంజీవి, జిల్లా టిఆర్ఎస్ నాయకులు డేరంగుల బ్రహ్మంగారు, సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి, మండలఎస్టీ సెల్ కార్యదర్శి భూక్యా నరసింహ నాయక్, మల్లు పల్లి సర్పంచ్ రాయల నాగేశ్వరరావు, అన్నవరం సర్పంచ్ ముత్యాల నాగమణి,నాగేశ్వరావు రామనర్సయ్య నగర్ సర్పంచ్ కాంతమ్మ, అంజనాపురం సర్పంచ్ నాగదేవి రాంబాబు, చల్లగుండ్ల రమేష్, దండుగుల ఏడుకొండలు, చిన్న, వెంకటేశ్వర్లు, జి.బాబు, హరి తదితరులు పాల్గొనడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube