పోలవరం పై రాహుల్ గాంధీతో చర్చించిన కాంగ్రెస్ నాయకులు

పోలవరం పై రాహుల్ గాంధీతో చర్చించిన కాంగ్రెస్ నాయకులు

0
TMedia (Telugu News) :

పోలవరం పై రాహుల్ గాంధీతో చర్చించిన కాంగ్రెస్ నాయకులు

టీ.మీడియా..అక్టోబర్.20.. చింతూరు….

కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో కార్యక్రమంలో భాగంగా కర్ణాటక రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ లోకి చేరిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎండి హబీబ్ రాహుల్ గాంధీని కలిసి ముంపు మండలాల్లో వరదలు నిర్వాసితుల సమస్యలను రాహుల్కు వివరించారు. అమరావతి రైతుల సమస్యలపై రాహుల్ గాంధీ గంట సమయం కేటాయించిన సమయంలో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా హబీబ్ మాట్లాడుతూ పోలవరం ముంపు పరిహారం విషయంలో మైదాన ప్రాంతాల్లో 30 నుండి 40 లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తున్నారని ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో సర్వం కోల్పోతున్నా నిర్వాసితులకు న్యాయపరమైన ప్యాకేజీ ఇవ్వడం లేదన్నారు. పోలవరం పరిహారం ముందుగా ఇచ్చి ఆపై ఆపై ప్రాజెక్టు నిర్మించాలని న్యాయ స్థానాలు ప్రజలు చెబుతున్నా గాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు.

ALSO REASD :మాఉద్యోగాలు మాకు ఇవ్వండి

జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో అన్ని ముంపు ప్రాంతాలకు సమ న్యాయం జరగడం లేదన్నారు. నాలుగు సార్లు వచ్చిన వరదలకు ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు అనేక కష్టాలు పడ్డారని. పోలవరం పరిహారం పూర్తిస్థాయిలో అందరికీ అందేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అధిక మొత్తంలో నిర్వాసితులు అందేలా చూడాలన్నారు. అనంతరం వినతిపత్రాన్ని రాహుల్ కి అందజేశారు. సమస్యల పై స్పందించిన రాహుల్ గాంధీ ఈ విషయంపై లోక్ సభ. రాజ్యసభలో గట్టిగా మాట్లాడటం జరుగుతుందని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే పోలవరం సమస్యలపై దృష్టిపెట్టి కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీని కలిసిన వారిలో ఎటపాక కాంగ్రెస్ నాయకులు నక్క ఎంకన్న. గంగులు నరసింహారావు. కిసాన్ మోర్చా అధ్యక్షుడు జెట్టి గురునాథం. యముడి అమర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube