ఢిల్లీ మహధర్నాలో పాల్గొన్న ఎంహెచ్ పిఎస్ నాయకులు
టి మీడియా ,డిసెంబర్ 13 వెంకటాపురం:
ములుగు జిల్లా వెంకటాపురం మండలం
పార్లమెంటు ఈ శీతాకాల సమావేశాల్లోనే ఎస్సీ కులాల వారిగా తెలంగాణ మాదిగల చిరకాల వాంచ వర్గీకరణ,12 శాతం రిజర్వేషన్ చేయాలనే డిమాండ్ తో మాదిగ సంఘాల ఐకాస చైర్మెన్ డా పిడమర్తి రవి ఆద్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ ధర్నాచౌక్ దగ్గర సోమవారం జరిగిన మహధర్నాకి మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అద్యక్షుడు మైస ఉపేందర్ నాయకత్వంలో ములుగు జిల్లా నుండి అత్యధికంగా నాయకులు,కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నం గోపి, ములుగు జిల్లా అద్యక్షుడు వంకాయల వెంకటేశ్వర్లు, అసెంబ్లీ అద్యక్షుడు వేల్పుల రామ్ కుమార్, చిట్యాల సాగర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.