టీ మీడియా డిసెంబర్ 11 వనపర్తి : వనపర్తి పట్టణంలో ఆరో వార్డు మెట్పల్లిలో శనివారం రోజు కరోన మొదటి టీకా రెండో టీకా కార్యక్రమంలో పాల్గొన్న డీఎంహెచ్వ్ శ్రీనివాసులు ని డాక్టర్ బాలమణి ఆహ్వానించడం జరిగింది. వారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ప్రజల టీకా గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కంచె రవి, స్పెషల్ ఆఫీసర్ మన్యం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, నర్స్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం హరితహారంలో నాటిన మొక్కల పెంపకంలో భాగంగా ఆరో వార్డు మెట్పల్లిలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలకు దగ్గర ఉండి వాటర్ పైప్ ద్వారా నీటిని పట్టిన కౌన్సిలర్ కంచె రవి. కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోన టీకాకు భయపడకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని ఈ సందర్భంగా వార్డు ప్రజలకు సూచించారు.
