

అర్ధరాత్రి రోడ్డు నిర్మాణం
-కబ్జా దారులు రక్షణ కోసమా..?
-నాసిరకం బైటకు రాకుండానా..?
టి మీడియా , జనవరి 16,నిఘా విభాగం:ఖమ్మం నలువైపులా పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టి.రాష్ట్రానికే తల మాణికంగా తయారు చేయడం కోసం మంత్రి పువ్వాడ అజయకుమార్ విశేషంగా కృషి చేస్తున్నారు. మరో వైపు మున్సిపల్అధికారులు ,సిబ్బంది కొంతమంది అక్రమాలకు తెరలేపారు.నగరం లోని 22 వ డివిజన్ బిసి,ఎస్టీ హాస్టల్ మార్గం లోఅర్ధరాత్రి సిమెంట్ రోడ్డు నిర్మాణం అనుమానం కలిగిస్తోంది.ఉదయం వర్షం లో రోడ్డు పనులు మొదలు పెట్టడం తో అభ్యంతరం లు వచ్చాయి.దానితో అదే రోజు అర్ధ రాత్రి 12 గంటల తరువాత పూర్తి చేశారు..ఆరోడ్డు ను ఆక్రమించి,కాలువపై కొంతమంది షాప్ లు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించ కుండ నే ప్రక్కగా రోడ్డు వేశారు.వేసిన రోడ్డుకి ఉసిక తేలింది.ట్రాఫిక్ పెద్దగా ఉండని ,రవాణాకు ప్రత్యాన్న మాయం అవకాశం ఉన్న చోట హడావుడి గా రోడ్డు వేయడము వెనుక భారీ అక్రమము ఉంది అనేది తెలుస్తోంది.అక్రమాన్ని సక్రమం చేయడం కోసం రాత్రి ని ఎంచు కొన్నట్లు తెలుస్తోంది.రాత్రి వేసిన రోడ్డును ఉదయం పరిశీలిస్తే ఉసిక తెలి ఉంది . సుమారు 3 అంగుళాలు మేర సిమెంటు రోడ్డు పై గోడకు చేసినట్లు .ప్లాస్టరింగ్ చేశారు.
సార్ తో మాట్లాడండి.ఉదయం వర్షం లో రోడ్డు వేయడం గురించి టి మీడియా లో వచ్చిన కధనం పై తనకి తాను ఇంజనీర్ గా పరిచయం చేసుకుని ఫోన్ చేసి ఒకరు వివరణ ఇచ్చారు. వర్షం వస్తుంటే పట్టలు కోసం వెళ్ళాం..ఏమైనా ఉంటే మాసార్ తో మాట్లాడండి అనడం జరిగింది.ఆ సార్ కాంట్రాక్టర్ ప్రతినిధి అని తరువాత తెలిసింది.అదే ఇంజనీర్ కి మరుసటి రోజు అర్ధరాత్రి పని గురించి వివరణ కోసం ప్రయత్నం చేస్తే ఫోన్ ఎత్తలేదు.రాత్రి రోడ్డు వేసే సమయంలో ను వర్షము రావడం గమనార్హం.ఖమ్మం కార్పోరేషన్ అధికారులు ఆశ్రమానికి ఇది ఒక నిదర్శనం అనేది తెలుస్తోంది.