వలస వెళ్తున్న దినసరి కూలీ రైతులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 8 వనపర్తి : యాసంగి వరి పంటపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వైఖరి మార్చుకోవాలని టిపిసిసి మైనారిటీ కార్యదర్శి ఎండి. అంజాద్ అలీ అన్నారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా మదనపురం మండల కేంద్రంలో గురువారం వారు మాట్లాడుతూ వివిధ ప్రాజెక్టుల మరియు చెరువుల కింద తరతరాలుగా జాలువారుతున్న పొలాల్లో వరి పంట తప్ప వేరే పంట ప్రత్యామ్నాయం లేదు వేరే పంట వేయడానికి పొలాలు అనుకూలంగా లేనందున ఖచ్చితంగా వివిధ గ్రామాలలో మరియు కౌలు రైతులు పట్టణాలకు వలస వెళ్లే ఆలోచనలో ఉన్నందున తక్షణమే వరిపంటకు ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చి కౌలు రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు వేమన్న మాజీ సర్పంచ్ కృష్ణయ్య, మండల అధ్యక్షులు సత్య శిల్లా రెడ్డి, శ్రీనివాసులు, ఆవుల రాఘవేంద్ర, నాగన్న, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube