గ్రామంలో మినరల్ వాటర్
-కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వరంలో
టీ మీడియా, ఆగస్టు 6, వనపర్తి బ్యూరో : శుభ్రమైన సురక్షితమైన నీటిని తాగండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కొత్త సుగూర్ సర్పంచ్ జూదం వెంకటేష్ కోరారు. శనివారం పెబ్బేరు మండలంలోని కొత్త సుగూర్ గ్రామములో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ కేంద్రాన్ని సర్పంచ్ జూదం వెంకటేష్ అధ్యక్షతన ఎంపీపీ ఆవులు శైలజ కురుమూర్తి ,పెబ్బేర్ జెడ్పిటిసి పెద్దింటి పద్మ వెంకటేష్, ప్రారంభోత్సవం చేయడం జరిగింది.నీటి శుద్ధి కేంద్రం గ్రామ పంచాయతీ ద్వారా ఆపరేటర్ చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో కొత్త సుగూర్ గ్రామ సర్పంచ్ జూదం వెంకటేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు శుద్ధి చేయబడిన మంచినీరు అందించడం కొరకు ముందుకు వచ్చిన దాతలు దండు అర్జున్ పద్మ వారి కుమార్తె కవిత జ్ఞాపకార్ధంగా 60 వేల రూపాయలు షెడ్డు నిర్మించడానికి సహాయం చేసినందుకు మరియు కాంట్రాక్టర్ మల్లయ్య నిర్మాణానికి సహకరించినందుకు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదములు తెలియజేశారు.
Also Read : నూతన పిఆర్సి ఎప్పటి నుండి అమలు అయ్యెను
మా గ్రామం కిలోమీటర్ పొడవున ఉన్నందున ఇంకొక ప్లాంట్ అవసరం ఉంటుందని మీ సంస్థ ద్వారా మంజూరు చేయించగలరని కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ జనరల్ మేనేజర్ జూపల్లి పురుషోత్తం రావు ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అనంతరం గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలు సమక్షంలో జనరల్ మేనేజర్ గని దండు అర్జున్ దంపతులను శాలువాతో సత్కరించడం జరిగింది. అదే విధంగా అర్జున్ దంపతులు గ్రామ ప్రజలు సర్పంచ్ దంపతులు వెంకటేష్ మాధవి ఇద్దరిని సన్మానించచారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు యమ్. డి.ముజీబుర్ రహమాన్,శేఖర్ మరియు పెబ్బేర్ మండల ఎంపీపీ . ఎ.శైలజ కురుమూర్తి, జడ్ పి టి సీ పి. పద్మ వెంకటేష్ ,జూదం రమేష్, కే కురుమన్న,బీచుపల్లి, టిఆర్ఎస్ గ్రామ ఉపాధ్యక్షులు కే. రాముడు,ఎస్ అరుణ్ కుమార్, జి రమేష్,వివో ఏ నాగన్న,హై స్కూల్ చైర్మన్ మద్దిలేటి,ప్రైమరీ స్కూల్ చైర్మన్ వెంకటేష్,మాజీ మత్స్యకారుల ప్రెసిడెంట్ జి బాలరాజు, బీచుపల్లి, కె శ్యామ్ ప్రసాద్,శాంతన్న, కే సామేలు, బి జయన్న కే గోవిందు,ఏ మధు సుదన్, తెలుగు చింతలయ్య స్కూల్ టీచర్ స్వరూప రాణి ఆశ వర్కర్లు భారతి వార్డ్ సభ్యులు యువకులు గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube