మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్

ఇఫ్తార్ కు రూ.16లక్షలు , 8వేల రంజాన్ తోఫాలు పంపిణీ

1
TMedia (Telugu News) :

మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్
– ఇఫ్తార్ కు రూ.16లక్షలు , 8వేల రంజాన్ తోఫాలు పంపిణీ
– మైనార్టీ గురుకులాల్లో కార్పొరేట్ స్థాయిలో విద్య

– జెడ్పికోఆప్షన్ఎండి. రసూల్
టి మీడియా, ఎప్రిల్ 29,భద్రాద్రి కొత్తగూడెం :మైనార్జీల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకే దక్కుతుందని, గతంలో కనీవినీ ఎరుగుని రీతిలో ముస్లిం మైనార్టీలు ఆత్మగౌవరంతో జీవిచాలన్న సంకల్పంతో పాటు పవిత్ర రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ వైభవంగా జరుపుకోవాలన్న సంకల్పంతో జిల్లాలో ఇఫ్తార్ విందు కోసం రూ.16లక్షలు కేటాయించడం జరిగిందని, 8వేల మంది ముస్లిం మైనార్జీలకు రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి. రసూల్ తెలిపారు. జెడ్పీ సమావేశం హాల్లో 6వ స్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశం శుక్రవారం స్టాండింగ్ కమిటీ చైర్మన్ భూక్యా కళావతి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమాచేశానికి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కోఆప్షన్ సభ్యులు, స్టాండింగ్ కమిటీ మెంబర్ ఎండి. రసూల్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే మొట్టమొదటి సారిగా మైనార్టీల కోసం గురుకులాలను ఏర్పటు చేయడం జరిగిందని, వీటితో పాటుగా గురుకుల పాఠశాలలు, కళాశాలు ఏర్పాటు చేసిందని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాలురు 3, బాలికలకు 3 ప్రత్యేకించి ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధనలో విద్యను అందించడం జరుగుతోందన్నారు.

Also Read : ధాన్యం కొనుగోలు ప్రారంభం

కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు సర్వ సౌకర్యాలు కల్పించి ఒక్కో విద్యార్థికి సుమారంగా రూ. 1.20లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం జనాభాలో 7.65శాతం ఉన్న మైనార్జీలతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం పెద్దవేట వేస్తోందని, వారు అత్మగౌవరంతో జీవించాలన్న సంకల్పంతో అన్ని విధాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు షాదీముబారక్ వంటి పథకాలను అనులు చేస్తోందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనార్జీలు 81,817 మంది కాగా వీరిలో ముస్లింలు 83, 499మంది ఉన్నారని, వీధి సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ సారధ్యంలో కృతనిశ్చయంతో పనిచేస్తోందని ఎండి.రసూల్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube