గని కార్మికులు సకల జనుల సమ్మె స్ఫూర్తి కొనసాగించాలి

టీబీజీకేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య

1
TMedia (Telugu News) :

గని కార్మికులు సకల జనుల సమ్మె స్ఫూర్తి కొనసాగించాలి

– టీబీజీకేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య

టీ మీడియా,సెప్టెంబర్ 13, గోదావరిఖని : రామగుండం రీజియన్ జీడికే రెండవ గనిపై సకల జనుల సమ్మె స్ఫూర్తి సభ నిర్వహించారు.టీబీజీకేఎస్ గని ఫిట్స్ సెక్రటరీ దాసరి నర్సయ్య ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమావేశానికి ఏరియా ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్ రావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య హాజరై మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమానికి బొగ్గు కార్మికులు అండగా నిలిచి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు కేసీఆర్ పిలుపుతో జై తెలంగాణే మా నినాదమంటూ సకల జనుల సమ్మెకు నాంది పలికారని 13 సెప్టెంబర్ 2011 న సకల జనుల సమ్మెలో బొగ్గు పెల్ల బయటకు రాకుండా ఆంధ్ర పాలకుల ఆంక్షలకు ఎదురోడ్డి దేశ పాలకుల మెడలు వంచి తెలంగాణ సాధనకు ప్రధాన భూమిక పోషించాలని కార్మికన్నలకు జేజేలు పలికారు.

Also Read : పార్ల‌మెంట్ భ‌వ‌నానికి అంబేద్క‌ర్ పేరు పెట్టాలి

సకలజనుల సమ్మె స్ఫూర్తిని యువ కార్మికులు కొనసాగించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి అండగా నిలువాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు జేవి రాజు, టీబీజీకేస్ నాయకులు దేవ వెంకటేశం,ఎట్టం కృష్ణ, పర్లపల్లి రవి,దూటా శేషగిరి పుట్ట రమేష్ కృష్ణమూర్తి, గంగాధర్,దొరగండ్ల మల్లయ్య,శ్రావణ్ కుమార్, మధుబాబు,గని కమిటీ సభ్యులు వెంకటరామిరెడ్డి, ఉప్పులేటి తిరుపతి, ఐలయ్య,వెంకటేష్,రమేష్, సాయి,జలపతి,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube