కొనుగోలు కేంద్రాల్లో మొళిక వసతులు కల్పించాలి

కలెక్టర్ వి.పి.గౌతమ్

1
TMedia (Telugu News) :

కొనుగోలు కేంద్రాల్లో మొళిక వసతులు కల్పించాలి

టి మీడియా,ఏప్రిల్ 23, ఖమ్మం: కలెక్టర్ వి.పి.గౌతమ్

ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌళిక సదుపాయాలు కల్పించి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఖమ్మం రూరల్ మండలం గుర్రాల పాడు, ముదిగొండ మండలం గోకినేపల్లి, నేలకొండపల్లి మండలం బోదులబంద గ్రామాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని తేమశాతం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ దళారులను ఆశ్రయించవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించినట్లయితే ఒక్కరోజులోనే రైతుల ఖాతాలకు చెల్లింపులు జమ చేయడం జరుగుతుందని సూచించారు.

Also Read ; స్టాండ్ ను వెంటనే తొలగించాలి

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే సమయంలో తేమశాతం సరిచూసుకొని ఆరబెట్టి తీసుకు రావాలని గిట్టుబాటు ధర అందించడం జరుగుతుందని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు తరలించాలని వాతావరణ కేంద్రం వారు రానున్న రెండు మూడు రోజులు వర్ష సూచన ఉన్నట్లు సూచించిన నేపథ్యంలో తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉ చుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. వేసవి దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది. కలగకుండా షామియానాలు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం నేలకొండపల్లి మండలం తసీల్దార్ కార్యాలయన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం కొండపల్లి మండల కేంద్రంలో వెంచర్లను పరిశీలించి వివరాలను తెలుసుకొని
నియమనిబంధలను ఖచ్చితంగా పాటించాలని మండల తహశీల్దారును, ఎం.పి.డి.ఓను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యా చందన, జిల్లా సహాకార శాఖ అధికారి విజయకుమారి, జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి రాజేందర్, జిల్లా మేనేజర్ సోములు, తాసీల్దార్ సుమ, శ్రీనివాసరావు, ప్రసాద్, ఎంపి.డి.ఓలు అశోక్, శ్రీనివాస్, జమలారెడ్డి, కొనుగోలు కేంద్రం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube