అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలి

అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి

0
TMedia (Telugu News) :

అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలి

-అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి

టీ మీడియా, డిసెంబర్ 13, మహానంది : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలని మహానంది అంగన్వాడీ టీచర్ ఫాతిమా మేరి రాణి పేర్కొన్నారు. బుధవారం మహానందిలోని తహశీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో రెండవ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని,సుప్రీంకోర్టు తీర్పు అమలు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం వేతనాలు పెంచాలని,అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని, ప్రమోషన్ లో రాజకీయ జోక్యం అరికట్టాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలన్నారు.యాప్లు రద్దు చేయాలని, పదవీ విరమణ తర్వాత పింఛన్లు అందజేయాలని, బీమా సౌకర్యం కల్పించాలని, గ్యాస్ బిల్లులు సమయానికి అందజేయాలని, వంట పాత్రలు,నాణ్యమైన కూరగాయలు, బియ్యాన్ని మరియు తదితర ఆహార పదార్థాలను అందించాలని, టి ఏ లు డి ఏ లు ఇవ్వాలని, కనీస వేతనం 26,000 పెంచాలని, సూపర్వైజర్ పోస్టులు అర్హులైన వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు ఫాతిమా , సరస్వతి,పుష్పకల, మరియమ్మ,షాహిన్, సావిత్రి, విజయ, ఉమా మహేశ్వరి, ఆయాలు, తదితరులు పాల్గొన్నారు.

Also Read : 18న హైద‌రాబాద్‌కు రాష్ట్ర‌ప‌తి

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube