బంగారు మైసమ్మ తల్లి కి మంత్రి అజయ్ ప్రత్యేక పూజలు

బంగారు మైసమ్మ తల్లి కి మంత్రి అజయ్ ప్రత్యేక పూజలు

1
TMedia (Telugu News) :

బంగారు మైసమ్మ తల్లి కి మంత్రి అజయ్ ప్రత్యేక పూజలు.

టి మీడియా, మే 8ఖమ్మం కల్చరల్:స్థానిక జహీర్ పుర లోని శ్రీ బంగారు మైసమ్మ తల్లి జాతర లో ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ మంత్రి అజయ్ కు మేళతాళాలు, కోలాటం డప్పు నృత్యాలు తో, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి అజయ్ అమ్మవారికి సంప్రదాయ సిద్ధంగా పూజలు నిర్వహించారు. అమ్మవారికి నారికేళాలు, పూజా ద్రవ్యాలను అందించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ జగన్మాత అందరిని తమ దీవెనలతో ఎల్లప్పుడూ రక్షించాలని కోరారు. కరోనా మహమ్మారి లాంటి రుగ్మతలు ఇకముందు రాకుండా కాపాడాలని అమ్మవారు దీవెనలు ఇవ్వాలని ఆకాంక్షించారు.ఆలయ కమిటీ సభ్యులు నామవరపు ఈశ్వర్, నామవరపు సతీష్, సూరపల్లి ఉపేందర్, గుడిపాటి కళ్యాణ్రామ్, గోపాలరావు, జీ వీరస్వామి లు మంత్రి అజయ్ ను ఘనంగా సన్మానించారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో మంత్రి అజయ్ తో పాటు మేయర్ పునకల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్ , ఆర్ జె సి కృష్ణ, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, కార్పోరేటర్లు పగడాల నాగరాజు, కమర్తపు మురళి, దోన్వాన్ సరస్వతి, దోన్వాన్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

 

Also Read : పేద మహిళా కుటింభీకులకు బియ్యం పంపిణి

 

అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. దాదాపు రెండు వేల మందికి అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ మహా అన్నదానాన్ని కాలనీ పెద్దలు గోపాలరావు, జి వీరస్వామి, నామవరపు సతీష్, ఉపేందర్, ఉత్సవాల కన్వీనర్ ఈశ్వర్, కళ్యాణ్ రాములు ప్రారంభించారు. జాతరలో భాగంగా ఆదివారం తెల్లవారుజామునుంచే బైండ్ల గురువులచే కొలువు పూజలు సంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు. ఆదివారంతో ముగిసిన శ్రీ బంగారు మైసమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని ఆలయ అధ్యక్షులు నామ వరపు సతీష్, ప్రధాన కార్యదర్శి సురపల్లి ఉపేందర్, ఉత్సవాల కన్వీనర్ ఈశ్వర్, కళ్యాణ్ రామ్ లు పర్యవేక్షించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube