మంత్రి అజయ్.. అందరి ఆత్మీయుడు

ముఖ్యమంత్రి కేసిఆర్ కితాబు

1
TMedia (Telugu News) :

మంత్రి అజయ్.. అందరి ఆత్మీయుడు

ముఖ్యమంత్రి కేసిఆర్ కితాబు
టిమీడియా,జూలై18 భద్రాచలం:కకావికలమౌతున్న బాధితులకు కొండంత దైర్యన్నిచ్చావు. మోకాలి లోతు నీటిలో తిరుగుతూ తోడునీడైయ్యావు. ప్రభుత్వ పక్షాన పెద్దన్న పాత్ర పోశించావు. అందరిని ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నావు. ఇటువంటి నిబద్ధత కలిగిన నాయకుల అవసరం నేటి సమాజానికి ఉన్నది.” మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసిఆర్పేర్కొన్నారు.గోదావరి నది పరివాహక ప్రాంతాలలో కురిసిన వర్షాలు ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా భద్రాచలం వద్ద ముంపుకు గురైన వరద బాధితులకు సహాయ చర్యల నిమిత్తం సీఎం కేసిఆర్ ఆదివారం భద్రాచలంలో పర్యటించారు. అనంతరం బాధితులతో వరద పరిస్థితిని సీఎం సమీక్షించారు.ఈ పర్యటనలో ముఖ్యమంత్రి కేసిఆర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను పొగడ్తలతో ముంచెత్తారు. గత వారం రోజులుగా వరదలతో భద్రాచలం వాసులు కకావికలం అయిన నేపథ్యంలో ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. అక్కడే మంత్రి అజయ్ మకాం వేసి వరద సహాయక చర్యల్లో తలమునకయ్యాయి.

 

Also Read : కావ్య హాస్పిటల్ లో హెల్త్ చెకప్ క్యాంప్

ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికార యంత్రాంగన్ని సమన్వయం చేశారు .దీంతో ప్రజల పట్ల మంత్రి అజయ్ కు మమకారం, బాధ్యత పనిపై ఉన్న నిబద్ధత అభినందనీయమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేకంగా కొనియాడారు. కకావికలమౌతున్న గోదావరి వరద బాధితులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి మోకాలి లోతు నీటిలో తిరుగుతూ తోడునీడగా నిలిచారని ప్రభుత్వ పక్షాన పెద్దన్న పాత్రను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పోషించారని పువ్వాడ లాంటి నిబద్ధత కలిగిన నాయకుల అవసరం నేటి సమాజానికి ఉన్నదని, మంత్రి అజయ్ అందరి ఆత్మీయుడు అని సీఎం కేసిఆర్ పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube