హర హర శంభో శంకర

మహాశివుడి భక్తుడిగా మంత్రి ఎర్రబెల్లి

0
TMedia (Telugu News) :

హర హర శంభో శంకర..

-మహాశివుడి భక్తుడిగా మంత్రి ఎర్రబెల్లి

లహరి, జనవరి 27, వరంగల్ : ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు.. తెలంగాణ‌ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు.. ఎప్పుడూ రాజకీయాలతో ఫుల్ టు ఫుల్ బిజీగా ఉండే మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు.. ఈ మధ్య దైవ చింతనలో ఉంటున్నారు. గత రెండు వారాల క్రితం వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఇప్పుడు పరమ శివ భక్తుడిగా మారిపోయారు. వరంగల్ చారిత్రక పర్వత గిరి శివాలయంలో పునః ప్రతిష్ట పూజలో కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అక్కడ నిర్వహించిన కార్యక్రమాల్లో పూర్తి సంప్రదాయ పద్దతుల్లో పూజా కార్రక్రమాల్లో పాల్గొన్నారు. మూడు రోజుపాటు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మహా లింగార్చన, పంజామృతాభిషేకం కార్యక్రమాలను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దంపతులు నిర్వహిస్తున్నారు.

Also Read : కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ నేత

పర్వతగిరి.. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు స్వగ్రామం కావడంతో.. అన్నీ తానై ముందుండి నడిపించారాయన. 800 ఏళ్ల నాటి ఈ శివాలయానికి పూర్వవైభవం తేవడమే తమ లక్ష్యంగా చెబుతున్నారు ఎర్రబెల్లి కుటుంబ సభ్యులు. కాకతీయుల వైభవాన్ని చాటి చెప్పేలా పర్వతగిరి శివాలయం పునః నిర్మాణం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube