మృతుల కుటుంబాలకు మంత్రి హరీష్ రావు గారుపరామర్శ

మృతుల కుటుంబాలకు మంత్రి హరీష్ రావు గారుపరామర్శ

1
TMedia (Telugu News) :

మృతుల కుటుంబాలకు మంత్రి హరీష్ రావు గారుపరామర్శ

టి మీడియా, మే26,,సిద్ధిపేట : సిద్ధిపేట రూరల్ మండలం కో ఆప్షన్ మెంబర్ జహంగీర్ తనయుడు రఫిక్ ఇటీవల యాక్సిడెంట్ లో మృతి చెందారు. ఈ మేరకు వారి కుటుంబాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు పరామర్శించి.. జహంగీర్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు.

అధైర్య పడొద్దు.. ఎల్లారెడ్డి కుటుంబానికి అండగా ఉంటా

Also Read:మోడీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్

చింతమడక గ్రామ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు భైరి ఎల్లారెడ్డి ఇటీవల తన వ్యవసాయ పొలం వద్ద కరెంటు షాక్ కు గురయ్యారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మేరకు చింతమడకలో ఎల్లారెడ్డి కుటుంబాన్ని మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటానని రైతు ఎల్లారెడ్డి కుటుంబీకులలో మంత్రి మనోధైర్యాన్ని నింపారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, సర్పంచ్ హంసకేతన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Also Readనాటుసారా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్. ద్విచక్ర వాహనం స్వాధీనం: ఎక్సజ్ సీఐ రాము

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube