మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ఇండ్ల పట్టాల పంపిణీ
-ప్రభుత్వ విప్ బాల్క సుమన్
టీ మీడియా, జూన్ 24,రామకృష్ణాపూర్:
క్యాతన్పల్లిపురపాలకం,రామకృష్ణా పూర్ పట్టణంలో ని విజయ గణపతి ఆలయం లో శుక్రవారం కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి చేతుల మీదుగా నేడు లబ్ధిదారులకు పంపిణీ చెయనున్న ట్లు ప్రభుత్వ విప్,చెన్నూరు శాసన సభ్యుడు బాల్క సుమన్ అన్నారు. గురువారం 9 వ వార్డ్ ఆర్.ఆర్ నగర్ లో 30 గుంటల స్థలం కేటాయించి, కోటి రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న వైకుంఠ ధామం నిర్మాణానికి భూమి పూజ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రామకృష్ణాపూర్, మందమర్రి పట్టణాల్లో ఖాళీగా ఉన్న క్వార్టర్ లను సింగరేణి రిటైర్డ్ కార్మికుల,స్థానికులకు కేరాయిస్తాని తెలిపారు.
Also Read : ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు
మరో రెండు నెలలు జి.ఓ 76
రామకృష్ణాపూర్ పట్టణంలో యిండ్లు నిర్మించుకున్న వారి కొరకు మరోసారి జి.ఓ నెంబర్ 76 ను పొడిసించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్,కౌన్సిలర్ లు అలుగుల శ్రీలత,పొలం సత్యం,జాడి శ్రీనివాస్,బోయినిపల్లి అనిల్ కుమార్, జీలకర మహేష్ ,మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ, ఏ.ఈ అచ్యుత్ లు పాల్గొన్నారు.