సీఎం సభ ఏర్పాట్లు,కలక్టరేట్ పరిశీలించిన మంత్రి,ఎంపిలు,ఏం ఎల్ సి

సీఎం సభ ఏర్పాట్లు,కలక్టరేట్ పరిశీలించిన మంత్రి,ఎంపిలు,ఏం ఎల్ సి

0
TMedia (Telugu News) :

సీఎం సభ ఏర్పాట్లు,కలక్టరేట్ పరిశీలించిన మంత్రి,ఎంపిలు,ఏం ఎల్ సి

టీ మీడియా,జనవరి 11,ఖమ్మం : ఈ నెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఖమ్మం నూతన కలెక్టర్ భవన సముదాయాన్ని బుధవారం బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరరావు , మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ఎంపి వద్దిరజు రవి చంద్ర తో కలసి సందర్శించి, పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా నామ, పువ్వాడ , వద్ది రాజు ఏం ఎల్ సి తాతా మధుసూదన్ నూతన భవన సముదాయంలోని ముఖ్య క్యాబిన్లను పరిశీలించి, అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం సీఎం సభా వేదికను, జనం కూర్చునే ప్రదేశాన్ని పరిశీలించి, అధికారులకు , నిర్వాహకులకు తగు సూచనలు చేశారు .ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఎంపీ నామ మాట్లాడుతూ ఖమ్మంలో 5 గురు సీఎంలతో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించడం మన అదృష్టమని చెప్పారు. పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, ఎమ్మెల్సీ , పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు గారు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం , మేయర్ నీరజ ,డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ , రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు ,సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న గారు,పార్టీ పట్టణ అధ్యక్షులు పగడాల నాగరాజు , నాయకులు ఆర్జేసీ కృష్ణ గారు, చిత్తారు సింహాద్రి యాదవ్, బాణాల వెంకటేశ్వరరావు , గొడ్డేటి మాధవరావు, పాల్వంచ కృష్ణ, కమర్తపు మురళి, నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Also Read : ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన వాయిదా

సన్నాహక సమావేశం

పువ్వాడ క్యాంప్ కార్యాలయంలో సీఎం సభ విజయవంతానికి జరిగిన సన్నాహక సమావేశంలో నామ పాల్గొని మాట్లాడారు.ఖమ్మంలో 18 న 5 గురు ముఖ్యమంత్రులతో భారీ సభ నిర్వహించడం అంటే పండుగేనని అన్నారు. అన్ని శక్తులు కూడగట్టుకొని సభను విజయవంతం చేయాలన్నారు. ఖమ్మం సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.ఇంకా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube