అవినీతి కేసులో మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలు శిక్ష

అవినీతి కేసులో మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలు శిక్ష

0
TMedia (Telugu News) :

అవినీతి కేసులో మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలు శిక్ష

టీ మీడియా, డిసెంబర్ 21, చెన్నై: అవినీతి కేసులో తమిళనాడు మంత్రి కె. పొన్ముడికి మద్రాస్‌ హైకోర్టు గురువారం మూడేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. పొన్ముడి వెంటనే జైలులో లంగిపోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. రూ.1.75 కోట్ల అక్రమాస్తుల కేసులో రెండు రోజుల క్రితం ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ.. డిఎంకె నేత, మంత్రి పొన్ముడి, ఆయన భార్యను మద్రాస్‌ హైకోర్టు దోషులుగా నిర్థారించిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం.. చట్టసభల సభ్యులను కోర్టు దోషిగా నిర్థారించినట్లైతే.. వారు పార్లమెంటు లేదా అసెంబ్లీకి అనర్హులు. దీంతో పొన్ముడి దోషిగా తేలడంతో ఆయనను మంత్రి పదవి నుండి తొలగించినట్లు సమాచారం.

Also Read : విద్యుత్‌ సరఫరా, ఉత్పత్తిపై శ్వేతపత్రం

ఆయన పోర్ట్‌ఫోలియోను మరొకరికి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను తన మంత్రి వర్గం నుండి తప్పించాలని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి డిమాండ్‌ చేసిన మరుసటి రోజే శిక్ష ఖరారు కావడం గమనార్హం.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube