చెక్కు అందజేసిన మాజీ మంత్రి
టీ మీడియా, డిసెంబరు 9, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో గోపాల్ పేట్ మండలం బుద్ధారం గ్రామానికి చెందిన కావలి మన్యం గత ఆరు నెలల క్రితం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నందువల్ల శుక్రవారం సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేతులు మీదగా మాజీ మంత్రి ఎఐసిసి కార్యదర్శి పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి చేతుల మీదుగా హైదరాబాదులో బోయిన్పల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర కావలి సుమిత్ర కి రెండు లక్షల బీమా చెక్కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లెల ప్రవీణ్ కుమార్ రెడ్డి, బుద్ధారం ఎన్రోల్మెంట్ సభ్యుడు గ్రామ కాంగ్రెస్ నాయకులు ఎల్లగౌడ్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎం దేవన్న యాదవ్ పాల్గొన్నారు.