ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు పై మంత్రి పువ్వాడ సమీక్ష.

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్, 29, భద్రాచలం

జనవరి 3 నుండి ప్రారంభమయ్యే ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం నందు పటిష్ట ఏర్పాట్లు చెయ్యాలని సంబంధిత అధికారులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు.

వచ్చే నెల 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న ముక్కోటి ఏర్పాట్లుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం లో మంత్రి పువ్వాడ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.దాదాపు రెండేళ్ల తరువాత భక్తులకు స్వామి వారి ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటున్నారని అందుకు తగు ఏర్పాట్లు పై అధికారులకు మంత్రి సూచనలు చేశారు.

కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తగు ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలన్నారు.
సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, శ్రీరామనవమి వేడుకలు నిర్వహించే వారమని, కోవిడ్ కారణంగా కొంత జాప్యం జరిగిందన్నారు.

ఇప్పటికే ఉత్సవం లేని సంవత్సరం ముక్కోటి ఏకాదశి ఉత్సవం లేని సంవత్సరంగా 2021 నిలిచిందన్నారు.

టికెట్స్ విషయంలో తగు చర్యలు తీసుకోవాలన్నారు. తప్పనిసరిగా టిక్కెట్లు కొనుక్కున్న వారికి ఎలాంటి ఆటంకం జరుగకుండా చూడాలన్నారు.
ఎప్పటికప్పుడు బ్లీచింగ్, శానిటైజెషన్, మస్కులు తప్పనిసరి ధరించాలని, విద్యుత్ దీపాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
కేవలం శుద్ధమైన త్రాగునీరు మాత్రమే అందించాలన్నారు. ఆలయంకు వచ్చే భక్తుల వాహనాలకు పార్కింగ్ సదుపాయాలు సమకూర్చలన్నారు.

తీర్ధ ప్రసాదాలు విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. తీర్ధ ప్రసాదాలు అందించే వారు శుభ్రత పాటిస్తూ నేరుగా ఇవ్వకుండా గ్లౌజ్ లు ధరించి ఇవ్వాలని సూచించారు.

ముక్కోటికి వచ్చే భక్తులకు సమకూర్చిన సౌకర్యాల వివరాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ మంత్రి పువ్వాడకు వివరించారు. మెయిన్‍ టెంపుల్‍, వైకుంఠద్వారం, అన్నదానం, పర్ణశాల, గోదావరి ఘాట్‍ ఏరియాలో రంగులు వేస్తున్నామన్నారు.
11 రోజుల పాటు రామాలయం, పర్ణశాల, గోదావరి ఘాట్‍ వద్ద లైటింగ్‍, 14,578 చదరపు అడుగుల మేర చలువ పందిళ్ల నిర్మాణం, తాత్కాలిక వసతి, డ్రెస్‍ చేంజింగ్‍ రూమ్స్​ 46,332 చదరపు అడుగుల్లో అద్దె ప్రాతిపదికన నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

ఎల్‍ఈడీ స్క్రీన్లు, క్లాత్‍ డెకరేషన్, ఆర్చీ గేట్ల నిర్మాణం జరుగుతున్నాయని వివరించారు.ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్రస్వామి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ అవతారాల్లో దర్శనం ఇవ్వనున్నారని పేర్కొన్నారు.

ప్రజలు తిలకించేలా 12వ తేదీన సాయంత్రం గోదావరిలో సీతారామచంద్రస్వామికి హంస వాహనంపై తెప్పోత్సవం నిర్వహించాలన్నారు.
13న తెల్లవారు జామున ఉత్తరద్వారంలో స్వామి భక్తులకు దర్శనం ఇస్తారని, 29న విశ్వరూప సేవ నిర్వహించనున్నట్లు చెప్పారు.

కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే పోదెం వీరయ్య, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఐటిడిఎ పిఓ గౌతమ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏ.ఎస్.పి శబరీష్ వివిధ శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Minister Puvada review on the arrangements for the three Ekadashi.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube