కృష్ణంరాజు మృతి పట్ల మంత్రిపువ్వాడ సంతాపం

కృష్ణంరాజు మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం

1
TMedia (Telugu News) :

కృష్ణంరాజు మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం
టీ మీడియా,సెప్టెంబర్ 11, ఖమ్మం:
ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో ‘ మాజీ కేంద్రమంత్రి, కృష్ణంరాజు మరణం పట్ల మంత్రి పువ్వాడ సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు(ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు) మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు.

Also Read : హీరో కృష్ణం రాజు మరణం పట్ల పొంగులేటి సంతాపం

లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు మంత్రి పువ్వాడ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube