నూతన కలెక్టరేట్ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ

నూతన కలెక్టరేట్ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ

1
TMedia (Telugu News) :

నూతన కలెక్టరేట్ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ

 

టీ మీడియా,సెప్టెంబర్ 29,ఖమ్మం: ప్రజలకు నాణ్యమైన, సత్వర సేవలు ఒకేదగ్గరఅందించాలని, పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవనం నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనసాగుతున్న పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు పూర్తికి వచ్చాయని, గత నెలలో వచ్చినప్పటికి ఇప్పటికీ పనులలో పురోగతి ఉందని కలెక్టర్, మంత్రికి వివరించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రూ. 44 కోట్లతో 1,69,000 వేల చ.అ. విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు వివరించారు.

Also Read : మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ

మెయిన్‌ బిల్డింగ్‌ ముందు భాగం, సివిల్ పనులు, ఎలక్ట్రిక్ తదితర పనులు పురోగతిలో ఉన్నట్లు, వర్కర్లను పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పలు గదులు ఇప్పటికే ఫ్లోరింగ్ పనులు సైతం పూర్తి అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. భవనం మొత్తం తిరిగి విద్యుత్‌ పనులు, ప్యాన్ల ఏర్పాటు, డ్రైనేజీ, నీటి సరఫరా, పార్కింగ్‌, టైల్స్‌, గార్డెనింగ్, గ్రీనరీ స్థలంకు సంబందించిన మ్యాప్ ను పరిశీలించారు. ఇంకా చేపట్టాల్సిన పనులు వివరాలను అధికారులను అడిగి తెలసుకున్నారు. పనులను మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందని ఆదేశించారు. మిగులు చిన్న చిన్న పనులు, విద్యుత్ ఇతర చేపడుతున్న పనులు సమాంతరంగా చేపట్టాలని ఆయన అన్నారు. పనుల్లో మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సందర్భంగా ఆర్ అండ్ బి, విద్యుత్, మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube