సుశీలమ్మ మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం..

పూలమాలలు వేసి నివాళులు

1
TMedia (Telugu News) :

సుశీలమ్మ మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం..

-పూలమాలలు వేసి నివాళులు

టి మీడియా, మే8,ఖమ్మం:
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి బంధువులు రావులపల్లి సుశీలమ్మ గారి మృతి పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Also Read : ఇంజినీరింగ్‌ విద్యార్థులకు రెండు వారాల వేసవి సెలవులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలోని వారి నివాసంలో ఉంచిన ఆమె భౌతికకాయాన్ని మంత్రి పువ్వాడ సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఆమె కుమారులు రావులపల్లి రాంప్రసాద్, రవి, కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.ఆమెతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. సుశీలమ్మ గారి మరణం విచారకరమని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube