లోకేశ్‌ రాకతో టీడీపీ పతనం మొదలైంది

మంత్రి రోజా

1
TMedia (Telugu News) :

లోకేశ్‌ రాకతో టీడీపీ పతనం మొదలైంది

– మంత్రి రోజా

టి మీడియా, సెప్టెంబర్ 19 తాడేపల్లి : రాష్ట్ర ప్రజలను వంచించేందుకు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఏపీ మంత్రి ఆర్‌కే రోజా ఆరోపించారు. రైతుల కోసం తమ ప్రభుత్వం ఏదీ చేయడం లేదని అనడం నిజంగా వారి బుద్ధిలేనితనానికి నిదర్శనమన్నారు. రైతులు, మహిళలు, యువతకు అందజేస్తున్న సంక్షేమ పథకాల కారణంగానే మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు సీఎం జగన్‌ వెన్నంటే నిలిచారని ఆమె పేర్కొన్నారు. బుర్రలేని లోకేశ్‌ తనకు కొడుకుగా ఎలా పుట్టాడని జగన్‌ను చూసిన ప్రతి క్షణం చంద్రబాబు ఏడుస్తుంటాడని తీవ్రంగా ఎద్దేవా చేశారు.

Also Read : అడవి శాఖ అతిథి గృహస్థలం కాపాడాలి

రైతులకు మద్దతు ఇస్తున్నామంటూ ఎడ్ల బండిని లాక్కొని నారా లోకేశ్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారని మంత్రి రోజా చెప్పారు. దేశంలో రైతు ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబే అని.. ఈ విషయాన్ని ఎవరిని అడిగినా చెప్తారని ఆమె దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అని వ్యాఖ్యానించిన చంద్రబాబు కుమారుడు ఇవాళ జగన్‌ను రైతు ద్రోహి అనడం బాధేస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 39 నెలల్లోనే 39 ఏండ్లుగా రైతులు పడుతున్న కష్టానికి పుల్‌స్టాప్‌ పెట్టి రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందించారని వెల్లడించారు.చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయని, ఆయన మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులను జగన్‌కు ఇచ్చి వెళ్లారని ఆరోపించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube