నూతన వసతి గృహం ప్రారంభోత్సవం చేసిన మంత్రిసబిత

నూతన వసతి గృహం ప్రారంభోత్సవం చేసిన మంత్రిసబిత

1
TMedia (Telugu News) :

నూతన వసతి గృహం ప్రారంభోత్సవం చేసిన మంత్రిసబిత

టీ మీడియా ,సెప్టెంబర్‌ 24, బెల్లంపల్లి :నియోజకవర్గం లో బెల్లంపల్లి మండలంలో 1 కోటి 35 లక్షల రూపాయల డి.ఎమ్.టి.ఎఫ్ నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల వసతి గృహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన ముఖ్యఅతిథిలుగా విద్యా శాఖామంత్రి శ్రీమతి పట్లోళ్ల సబిత ఇంద్రారెడ్డి హాజరై భవనాన్ని ప్రారంభించారు.

Also Read : పోడుకిశాశ్వత పరిష్కారం కు జిల్లా సమన్వయ కమిటీ

ఎమ్మెల్సీ శ్రీ కూర రగోత్తం రెడ్డి , తెలంగాణ రాష్ట్ర టి.ఎస్.ఈ.ఐ.డి.సి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి , మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళీకెరీ, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి పదం లో దూసుకుపోతున్నపుడు రాష్ట్రం లోకి వచ్చి పాదయాత్రలు సభలు చేస్తుంటే చూస్తు తెలంగాణ ప్రజలు వురుకోరు అని అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మీ ఎమ్మెల్యేె ఎప్పుడు ఎక్కడ కలిసిన మాకు ఒక కళాశాల కావాలి అని కోరుతు వుంటాడు నియోజకవర్గం లో కస్తూరిబా ,జూనియర్ ,కళాశాలలు చాలా వరకు ఏర్పాటు చేసుకు౦టు వస్తున్నాము అలాగేముఖ్యమంత్రి తో మాట్లాడి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరిక మేరకు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తాము మంత్రి సబితా ఇంద్రారెడ్డి తేలియచేసారు.

Also Read : ఎమ్మెల్యే తో కలసి ఎంపీ నామ సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

మండల లోని లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్ కార్డులు, బతుకమ్మ ప౦డుగ సందర్భంగా ప్రభుత్వం ప్రతి ఏడాది ప౦పిణి చేసె బతుకమ్మ చీరలు,దానిలో భాగంగా కళ్యాణలక్ష్మి మరియు షాదీముభారఖ్ చెక్కులను అందచేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ , జిల్లా గ్రంధాలయ చైర్మన్ ప్రవీణ్ , బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్ , వైస్ చైర్మన్ సుదర్శన్ , కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ , వైస్ ఎంపీపీ రాణి-సురేష్ , మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస పార్టీ యువజన విద్యార్థి సంఘం నాయకులు, కార్యకర్తలు, , బెల్లంపల్లి ఆర్.డి.వో శ్యామలదేవి , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube