ఆప్‌ మంత్రి సత్యేంద్ర జైన్‌కు బెయిల్ నిరాకరణ

ఆప్‌ మంత్రి సత్యేంద్ర జైన్‌కు బెయిల్ నిరాకరణ

1
TMedia (Telugu News) :

ఆప్‌ మంత్రి సత్యేంద్ర జైన్‌కు బెయిల్ నిరాకరణ

టీ మీడియా, నవంబర్ 17, ఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్ట్‌ అయిన ఆమ్‌ఆద్మీపార్టీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ప్రత్యేక జడ్జి జస్టిస్ వికాస్‌ ధుల్, సత్యేంద్రకు బెయిల్‌ మంజూరు చేయలేదు. తమను తప్పుతోవ పట్టించారని, విచారణకు సహకరించడం లేదని సత్యేంద్ర బెయిల్‌ పిటిషన్‌ని వ్యతిరేకిస్తూ ఈడీ అధికారులు వాదనలు వినిపించారు. కోర్టు సత్యేంద్ర బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడం ఇది రెండోసారి. జూన్‌ నెలలో కూడా ఆయన బెయిల్‌ దరఖాస్తుని ఢిల్లీ కోర్టు కొట్టేసింది. ఇదే కేసులో అరెస్ట్‌ అయి బెయిల్‌ కోసం ఎదురుచూస్తున్న వైభవ్‌ జైన్‌, అంకుశ్‌ జైన్‌లకు కూడా చుక్కెదురైంది.

Also Read : కలెక్టర్ వచ్చేదాకా కదల౦

మనీలాండరింగ్ కేసులో మే ౩౦వ తేదీన సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు.జైలులో ఆయనకు వీఐపీ సేవలు అందుతున్నాయనే వార్తలు బయటికి రావడంతో ఈమధ్యే తీహార్ జైలు సూపరింటెండెంట్‌ని సస్పెండ్ చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్‌ అయి అదే జైలులో ఉన్న సహ నిందుతులను సత్యేంద్ర పదే పదే కలుస్తున్నారని, తద్వారా ఈ కేసుని ప్రభావితం చేస్తున్నారని ఈడీ ఆరోపిస్తోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube