మంత్రిని విమర్శించడం చిన్నారెడ్డికి తగదు

మంత్రిని విమర్శించడం చిన్నారెడ్డి తగదు

1
TMedia (Telugu News) :

మంత్రిని విమర్శించడం చిన్నారెడ్డికి తగదు

టీ మీడియా, మార్చి 14, వనపర్తి : కొల్లాపూర్ బహిరంగసభలో ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి విమర్శించడం తగదని వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి పదవి అనుభవించిన నాలుగు ఎకరాలకు నీళ్లు తేలేని చిన్నారెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డిని విమర్శించడం విచిత్రం అన్నారు. 52 వేల ఓట్ల భారీ ఆధిక్యంతో మంత్రి నిరంజన్ రెడ్డి గెలిపిస్తే చిన్నారెడ్డికి బుద్ధి రాలేదు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థుల దొరకక పోటీ పెట్టని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అధికారం గురించి మాట్లాడటం హాస్యాస్పదం మూడేళ్లు తిరగకముందే అధికారం మీద ఆశతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెడితే పట్టభద్రులు ఓడించిన, అభివృద్ధి కళ్ళముందు కనిపిస్తున్న, కన్నులుండి చూడలేని కబోదిలా, చెవులు ఉండి వినలేని మనస్తత్వం గల సున్నారెడ్డి మీ అంత స్వార్థం అసూయ లోభ మనస్తత్వం గల నేత రాజకీయాల్లో కనిపించాడు. నీళ్లు ఎక్కడ పారుతున్నయో కనిపించడం లేదా రేవంత్ రెడ్డికి కళ్లాలు కనిపించడం లేదా కళ్లాలో నిండిన ధాన్యాపు రాశులు కనిపించడం లేదా ఊరిలో కొన్న ధాన్యం కనిపించడం లేదా ఇప్పటికైనా మించిపోయింది లేదు, రైస్ మిల్లులో గోదాంలో రైతు వేదికకలకు వెళ్తే ఇప్పటికీ కనిపిస్తాయి కనిపిస్తాయి ధాన్యపు రాశులు కాంగ్రెస్ పార్టీది గడిచిపోయిన చరిత్ర అధికారం కాంగ్రెస్ కి ఎండమావి అందని ద్రాక్ష అన్నారు.

Also Read : మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube