మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో ఊరట..
– ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత
టీ మీడియా, అక్టోబర్ 10, హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ ఓటరు రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో ఆఫీడవిట్ ట్యాంపరింగ్ చేసారని ఎమ్మెల్యేగా అనర్హుడు అంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు విచారణలో భాగంగా గతంలో అడ్వకేట్ కమీషన్‌ను హైకోర్టు నియమించగా..అడ్వకేట్ కమీషన్ ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేరుగా విచారణకు హాజరయ్యారు.
Also Read : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం బిస్కెట్స్ పట్టివేత
అనంతరం అడ్వకేట్ కమిషన్ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఇరువురి వాదనలు పూర్తి అవగా… చివరకు శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube