ముంపు ప్రాంతాల్లో మంత్రి విస్తృత పర్యటన

ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా

1
TMedia (Telugu News) :

ముంపు ప్రాంతాల్లో మంత్రి విస్తృత పర్యటన

-. ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా

– కలెక్టర్లు, ఎస్పీతో సమీక్ష
టి మీడియా,జూలై23,భద్రాద్రి కొత్తగూడెం:
గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పర్యటించారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపద్యంలో భద్రాచలం దుమ్ముగూడెం ప్రధాన రహదారి పైకి వరద నీరు చేరడంతో పూర్తిగా రాకపోకలు స్తంభించాయి..

ఇప్పటికే ముంపు ప్రాంతాల బాధితుల సహయార్థం ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు రాకుండా తరలించిన విషయం తెలిసిందే..

వరద కొంత మేరకు తెరిపించడం, ప్రధాన రహదారులపై నీరు తొలగిపోవడంతో ఆయా ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ జడ్పీ చైర్మన్ కొరం కనకయ్య గారు, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు విపిగౌతమ్ గారు, అనుదీప్ గారు, పివోగౌతమ్ గారు, ఎస్పీ వినీత్ గారు,ఎస్పీరోహిత్ రాజ్ , వైద్య ఆరోగ్య శాఖధికారి తదితర ఉన్నతాధికారులతో కలిసి నేరుగా పర్యటించారు.

 

Also Read : 70 శాతం భూ సమస్యలను పరిష్కరించాం

 

దుమ్ముగూడెం, లక్ష్మి నగరం, సున్నం బట్టి, పర్ణశాల, గోదావరి కరకట్ట, మిథిలా స్టేడియం, తదితర ప్రాంతాలలో పర్యటించి ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడారు.

స్థానికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్షణ సహాయార్థం అధికారులు చర్యలు చేపట్టాలని, విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటు నిత్యం పర్యేక్షిస్తారని
బాధితులకు ధైర్యం కల్పించారు. పూర్తిగా కోలుకునే వరకు భోజన సౌకర్యం కల్పిస్తామని, శాశ్వత ప్రాతిపదికన నివాసాల కొసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి పరిష్కారం చూపిస్తామని హామి ఇచ్చారు.

అధైర్యపడొద్దని, మీకు ప్రభుత్వం అనునిత్యం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కొన్ని రోజులు అరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీకు అందుబాటులో వైద్య సౌకర్యాలు, మెడిసిన్ ఉంటాయని అన్నారు.

అనంతరం పర్ణశాల ఘాట్ ను సందర్శించారు. వరద తీవ్రతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాలలో పనిచేస్తున్న టీమ్ లు అప్రమత్తం చేయాలన్నారు.

వరద సహాయక చర్యలపై సమీక్షా…

వరదలు తగ్గుముఖం పట్టినందున పారిశుధ్యం, అంటు వ్యాధులు ప్రబల కుండా వైద్య సేవలు చేపట్టాలని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ఇటిసి సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు విపిగౌతమ్ , అనుదీప్ గారు, ఐటిడిఎ పిఓగౌతమ్ , ఎస్పీ వినీత్ , జెడ్పీ చైర్మన్ కొరం కనకయ్య తో కలిసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

 

Also Read : సాగుకు ఎరువుల సాయమెంత‌?

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరికి పెద్ద ఎత్తున వరద వచ్చినప్పటికి ప్రభుత్వం చేపట్టిన ముందు జాగ్రత్త చర్యల వల్ల ఏ ఒక్క ప్రాణనష్టం జరుగకుండా ప్రజలను కాపాడుకున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఅర్ గారి ఆదేశాల మేరకు వరద ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి పరిహారం, నిత్యావసర వస్తువులు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

ప్రజలు ఆందోళన పడొద్దని చెప్పారు. వ్యాధులు ప్రబలే కాలమని ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటి పరిసరాల్లో మురుగునీటి నిల్వలు లేకుండా పరిశుభ్రత పాటించాలని చెప్పారు. కాచి వడబోసిన మంచినీటిని మాత్రమే త్రాగాలని చెప్పారు..

మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులు నిరంతరం నీటి పరీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యాధులు ప్రబలుతున్న ప్రాంతాల్లో అత్యవసర వైద్య కేంద్రాలు నిర్వహించి వ్యాధులు ప్రబల కుండా నియంత్రణ చర్యలు చెపట్టాలని, ఆ విదంగా తక్షణ వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా ప్రజలకు మెడిసిన్ అందుబాటులో ఉండాలని, అన్ని ఆసుపత్రులలో, ప్రాథమిక హెల్త్ సెంటర్, వైద్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

ఇంకా వరద తీవ్రత తగ్గని బాధితులను పునరావాస కేంద్రాల్లోనే కొనసాగించాలని, వారికి కావాల్సిన వసతులు, ఆహారం సమకూర్చాలన్నారు.

ఇప్పటి వరకు వరద తీవ్రత వల్ల కలిగిన నష్టాన్ని ఎదుర్కొగలిగామని, మరో 10రోజులు సిబ్బంది, అధికారులు ఇదే స్పూర్తితో పని చేసేలా తగు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.

ప్రజలు వరద బారినపడిన వారికి విశిష్ట సేవలందించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ నేతృత్వంలోని జిల్లా యంత్రాంగాన్ని, అధికారుల సలహాలు, సూచనలు పాటించిన ప్రజలను మంత్రి అభినందించారు.

సహాయక చర్యల్లో బాగస్వాములైన ప్రతి ఒక్కరినీ మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

పారిశుధ్య కార్యక్రమాలు, ముంపు కుటుంబాల గణన లెక్కింపులో సిసిఎల్ఏ డైరెక్టర్ రజత్ కుమార్ సైని, రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ డైరెక్టర్ హనుమంత రావు, ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతం, ఖమ్మం సిపి విష్ణు వారియర్, భద్రాద్రి ఎస్పీ డా వినీత్, ఐటిడిఎ పిఓ పోట్రూ గౌతం, ఎఎస్పీ రోహిత్ రాజ్, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున బాగస్వాములై విపత్తు సమయంలో ప్రజలకు అండగా నిలిచారని అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube