బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

1
TMedia (Telugu News) :

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

టీ మీడియా,ఆగస్టు 5, విజ‌య‌వాడ: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ ఈవో భ్రమరాంబ, అర్చకులు సాదరంగా ఆహ్వానం పలికారు.

 

Also Read : మయూరి బుచ్చిబాబు ఇక లేరు

దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అల్లోల‌కు… వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్ర పటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. దుర్గమ్మను దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. అందరినీ చల్లగా చూడాలని దుర్గమ్మను కోరుకున్నానని మంత్రి తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube