నివాళులు అర్పించిన మంత్రి
టీ మీడియా, డిసెంబరు 1, వనపర్తి బ్యూరో : శ్రీరంగపూర్ మండలంలోని నాగసాని పల్లిలో పల్లెనిద్ర కార్యక్రమంలో ఉన్న మంత్రికి పెబ్బేరు మండలంలోని రామాపురం గ్రామంలో యువ రైతు బోయ లక్ష్మన్న (34) గుండెపోటుతో అకాల మరణం చెందారని వార్త తెలిసిన వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హుటాహుటిన రామాపురం గ్రామానికి వెళ్లి లక్ష్మన్న భౌతిక కాయనికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, ఇద్దరు పిల్లల పైచదువులు చదివేందుకు సహకారం అందిస్తానని, అలాగే ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని భరోసా ఇచ్చారు.
Also Read : రాజకీయ కక్ష సాధింపు కోసమే కవిత పై కేసు
ఈ సందర్భంగా పెబ్బేరు మండల తెరాస అధ్యక్షుడు వనం రాములు, మాజీ మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ బుచ్చారెడ్డి,రామాపురం తెరాస నాయకులు మాజీ సర్పంవ్ గోపాల్, హర్షవర్ధన్ రెడ్డి,సత్యారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.