ఉద్యోగాల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి

ఉద్యోగాల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి

0
TMedia (Telugu News) :

ఉద్యోగాల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి

టీ మీడియా, ఫిబ్రవరి 7, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని వల్లబ్ నగర్ లో షెడ్యూలు కులాల విద్యార్థులకు గ్రూప్ 2 3 4 ఉద్యోగాల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరైన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానవుడు నిరంతర విద్యార్థి అంతా తెలుసు అనుకోవడం తప్పు ఇంకా నేర్చుకోవాలి అనుకున్న వారే గొప్ప వారు అవుతారు ఎంత గొప్ప వారికైనా కొన్ని విషయాలు తెలియవు గ్రూప్ 2,3,4 శిక్షణ పొందుతున్న వారు శక్తివంచన లేకుండా చదవాలి ఫలితాలు వచ్చిన తర్వాత ఉద్యోగం రానివారు ఎవరూ నిరాశ చెందవద్దు జీవితంలో అవకాశాల కోసం నిరంతరం ప్రయత్నం చేయాలి నిరుపేదల కోసం గ్రూప్ ఉద్యోగాల కొరకు దూరదృష్టితో 33 జిల్లాలలో మూడు నెలలు శిక్షణ కేంద్రాలు గ్రూప్ 2,3,4 ఉద్యోగాల శిక్షణకు వచ్చే విద్యార్థులను ఒరిజినల్ సర్టిఫికెట్లు కావాలని నిబంధన పెట్టొద్దు వివిధ కారణాల చేత వారి సర్టిఫికెట్లు వివిధ సంస్థలలో ఉండే అవకాశం ఉన్నది ప్రభుత్వ ఉత్తర్వులకు అదనంగా శిక్షణ కోసం విద్యార్థులు వస్తే నా దృష్టికి తీసుకురావాలి. వారి శిక్షణకు అయ్యే ఖర్చును నేను భరిస్తాను.

Also Read : నేటి నుండి2000 నోట్ల మీద పరిమితి

అని అన్నారు శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రతి రోజూ స్వంత డబ్బులతో గుడ్డు, అరటిపండు అందిస్తానని మంత్రి అన్నారు గ్రూప్ ఉద్యోగాల శిక్షణకు వచ్చిన అభ్యర్థులకు పలు ప్రశ్నలు వేసి నగదు బహుమతులు అందజేస్తామని మంత్రి అన్నారు. గతంలో సింగిరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు క్వాలిఫై అయిన అలంపూర్ తాలూకా ఊట్కూరు వాసి ప్రీతిని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, స్థానిక కౌన్సిలర్ నందిమల్ల భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube