కంటి వెలుగు ను ప్రారంభించిన మంత్రి
టీ మీడియా, జనవరి 18, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణంలో బాల భవన్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిభిరం ద్వారా ప్రతి ఒక్కరూ కంటి పరిక్షలు చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా,అడీషనల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఆర్డీవో పద్మావతీ, మున్సిపల్ కమిషనర్ విక్రం సింహరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కౌన్సిలర్లు చీర్ల సత్యం, బండారు కృష్ణ, శ్యాం మాజీ కౌన్సిలర్ ఉంగుళం తిరుమల్, అధికారులు, నాయకులు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.