ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు గంగుల , పువ్వాడ పర్యటన

బీసీ స్టడీ సర్కిల్ భవనం ప్రారంభం, ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

1
TMedia (Telugu News) :

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు గంగుల , పువ్వాడ పర్యటన

-బీసీ స్టడీ సర్కిల్ భవనం ప్రారంభం, ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

-అధికారులతో సమీక్ష.
టి మీడియా,మే14,ఖమ్మం/వైరా: మంత్రులు గంగుల కమలాకర్,పువ్వాడ అజయ్ కుమార్ లు శనివారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.బీసీ స్టడీ సర్కిల్ భవనం ప్రారంభించడం తో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శన, అధికారులు తో సమీక్ష కార్యక్రమం చేశారు.
హాజరైన ఎమ్మెల్యేలు సండ్ర రాములు నాయక్, ఎమ్మెల్సీ తాత మధు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రెండు జిల్లాల కలెక్టర్లు వి.పి గౌతమ్, దురిశెట్టి అనుదీప్, అదనపు కలెక్టర్లు మధుసూదన్, వెంకటేశ్వరరావు రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, సివిల్ సప్లై కార్పొరేషన్ జిఎం రాజారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : 16న ‘ఆవేకన్ వరంగల్’

మంత్రి గంగుల కమలాకర్ గారి పాయింట్స్:
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని వసతులుకల్పించండి.పీపీసీల్లో మౌలిక వసతులు, సరిపడా గన్నీలు అందుబాటులో ఉన్నాయి.సీఎం కేసీఆర్ గారు రైతు అనుకూల విధానాలతో తెలంగాణలో దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి.కేంద్రం, ఎఫ్ సి ఐ మొదలైనప్పటి నుండి యాసంగిలో బాయిల్డ్, వానాకాలంలో రా-రైస్ మాత్రమేఇస్తున్నాము.తెలంగాణ రైతులపై కక్షతో కేంద్రం ఈసారిరా-రైస్ఇవ్వమంటున్నారు.యాసంగిలో పెరిగే బ్రాకెన్ పర్సంటేజీతో జరిగే నష్టాన్ని భరించి సీఎం కేసీఆర్ గారు ధాన్యంసేకరిస్తున్నారు.కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తాం.అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో సేకరణలో నిమగ్నం అవ్వాలి.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనుగోల్లు సజావుగా,అద్భుతంగాజరుగుతున్నాయని అర్థమవుతుంది.ఖమ్మం జిల్లాలో 36,171 మెట్రిక్ టన్నులు సేకరణ, 21.20 లక్షల గన్నీలు అందుబాటులో ఉన్నాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8043 మెట్రిక్ టన్నులు సేకరణ, 9 లక్షల గన్నీలు అందుబాటులో ఉన్నాయి.

Also Read : హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ఇప్పటికే జిల్లాలో మొత్తం సేకరణకు సరిపడా గన్నీలు అందుబాటులో ఉన్నాయి.
మిల్లర్ల ఇబ్బందుల్ని సైతం ప్రభుత్వం పరిష్కరిస్తుంది.

సజావుగా కొనుగోళ్లు :మంత్రి పువ్వాడ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ కృషితో కొనుగోళ్లు సజావుగాసాగుతున్నాయి.అక్కడక్కడ రైస్ మిల్లులు అన్లోడింగ్ చెయ్యట్లేదు అని ఫిర్యాదులు అందాయి వాటిని పరిష్కరించాం.కేంద్రం తీరుతో రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా సీఎం గారు ఆదుకున్నారు.ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఇప్పటికే తగు చర్యలు చేపట్టాం అన్నారు.రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలి అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube