రాజీనామాకు సిద్ధమవుతున్నమాజీ మంత్రులు..

రాజీనామాకు సిద్ధమవుతున్నమాజీ మంత్రులు..

1
TMedia (Telugu News) :

రాజీనామాకు సిద్ధమవుతున్నమాజీ మంత్రులు..
టీ మీడియా , ఏప్రిల్ 11అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో స్థానం దక్కని వైసీపీ తాజా మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు ప్రభుత్వంపై, పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్‌ వ్యవహార శైలీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు మంత్రి వర్గంలో హోంశాఖ బాధ్యతలు నిర్వహించిన సుచరితకు బెర్త్‌ దక్కకపోవడంతో ఆమె అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇవాళ కార్యకర్తలతో సమావేశమై తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పార్టీకి రాజీనామా చేయడం లేదని,నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు కూడా ఎవ రూ రాజీనామాలు చేయవద్దని సూచించారు.

Also Read : పీస్ కమిటీ సమావేశం

జగన్‌కు సమీప బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి వర్గం నుంచి తప్పించడంతో నిన్నటి నుంచి ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఆయనను బుజ్జగించ డానికి సీనియర్‌ నాయకులు సజ్జలతో పాటు శ్రీకాంత్‌రెడ్డి తదితరులు అనేక రకాలుగాప్రయత్నాలుచేశారు.బాలినేనిఅనుచరులుఒంగోలుపట్టనంలోరోడ్డెక్కినిరసనలుతెలుపుతున్నారు. బాలినేని ముఖ్య అనుచరులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అనుచరులు కంభంలో ఆర్యవైశ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube