మూకుమ్మడిగా 24 మంది మంత్రుల రాజీనామా

మూకుమ్మడిగా 24 మంది మంత్రుల రాజీనామా

1
TMedia (Telugu News) :

మూకుమ్మడిగా 24 మంది మంత్రుల రాజీనామా
టీమీడియా,ఏప్రిల్ 08 ,అమరావతి : మరో రెండు సంవత్సరాల్లో రాబోయే ఎన్నికలకు సన్నద్దం అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దీంట్లో భాగంగా సచివాలయంలో ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం నిర్వహించారు. ఇవాళ తొలి మంత్రివర్గంలో ఉన్న వారందరీ చేత రాజీనామా చేయించారు. మొత్తం 24 మంది మంత్రులు తమ రాజీనామా పత్రాలను ఏపీ సీఎం జగన్‌కు అందజేశారు. దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన క్యాబినెట్‌ సమావేశంలో ఏపీ మంత్రులంతా పాల్గొన్నారు.మంత్రులంతా రెండున్నరేళ్ల వరకే కొనసాగుతారని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినందున ఆ గడువు గత డిసెంబర్‌లో ముగిసింది. దీంతో మంత్రివర్గంలో మార్పుచేర్పులు చోటు చేసుకుంటున్నాయి. మంత్రులు ఆళ్లనాని,ధర్మాన కృష్ణదాస్‌, పాముల పుష్ప శ్రీవాణి, కే నారాయణ స్వామి, అంజద్‌ బాషా, సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకర్‌ నారాయణ, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ఆదిమూలపు సురేశ్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, తానేటి వనిత, రంగనాథ రాజు, అవంతి శ్రీనివాస్‌రావు, కన్నబాబు, పిన్నపి విశ్వరూప్‌, గమ్మనూర్‌ జయరాం, గోపాల కృష్ణ, సిదిరి అప్పలరాజు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.

Also Read : సేవా సదనము లో అన్న వితరణ

తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు.బినెట్ భేటీ ముగిసిన తర్వాత సచివాలయంలో వింత దృశ్యం కనిపించింది. భేటీలో సీఎం జగన్ ఆదేశానుసారం మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించిన 24 మంది..సచివాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ కాన్వాయ్‌లలో తిరిగి వెళ్లలేదు. గురువారం మధ్యాహ్నం కేబినెట్భేటీలో పలు కీలక అంశాలపై నేతలంతా చర్చించారు.అనంతరం తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన మంత్రులు.. కాన్వాయ్‌లను సచివాయలంలోనే వదిలేసి వెళ్లిపోయారు. వీళ్లంతా తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు సమర్పించి వెనుతిరిగారు. అనంతరం మంత్రి హోదాలో తమకు ప్రభుత్వం కల్పించిన అధికారిక కాన్వాయ్‌లను అక్కడే వదిలేశారు. సొంత వాహనాల్లో ఇళ్లకు వెళ్లిపోయారు.అంతేకాదు, కేబినెట్ భేటీకి ముందే తమతమ ఛాంబర్లను కూడా మంత్రులు ఖాళీ చేసినట్లు సమాచారం. కాగా, పాత మంత్రి వర్గంలోని కేవలం ఐదారుగురు నేతలకే కొత్త మంత్రివర్గంలో చోటు దక్కుతుందని వైసీపీ కీలక నేత కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరి రాజీనామాలు చేసిన వారిలో ఎవరికి ఈ పదవులు దక్కుతాయో చూడాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube