20 మంది మంత్రుల రాజీనామా
మీడియా, జూన్ 4,భువనేశ్వర్: ఒడిశాలోని మంత్రులందరూ ఇవాళ రాజీనామా చేశారు. సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజూ జనతా దళ్ ప్రభుత్వానికి అయిదోసారి మూడేళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్నారు. దానిలో భాగంగానే మంత్రులందరూ రాజీనామా చేశారు. రేపు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నారు.
Also Read : ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి
2024 జనరల్ ఎలక్షన్ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మంత్రులు పునర్ వ్యవస్థీకరణ చేపట్టారు. తాజా సమాచారం మేరకు 20 మంది మంత్రులు తమ రాజీనామాలను ఒడిశా అసెంబ్లీ స్పీకర్‌కు సమర్పించారు. ఇక రేపు ఉదయం 11.45 నిమిషాలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రదీప్ అమత్, లతికా ప్రదాన్‌లకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube