పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని కార్యాలయాలు ఒకే చోట

పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని కార్యాలయాలు ఒకే చోట ఎర్పాటు.

1
TMedia (Telugu News) :

పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని కార్యాలయాలు ఒకే చోట ఎర్పాటు.

.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

-పోలీస్, తహశీల్దార్ కార్యాలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన

-పాల్గొన్నఎంపీలు నామ, వద్దిరాజు, కలెక్టర్, పోలీస్ కమిషనర్.

టీ మీడియా,అక్టోబర్ 10,ఖమ్మం: నియోజకవర్గం రఘునాథపాలెం మండల ప్రజల సుధీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను అతి త్వరలో చెక్ పడనుంది.ఖమ్మం అర్బన్ గా మండలం ఏర్పడినప్పుడికి జిల్లా కేంద్రం కు అనుకుని ఉండటం, అర్బన్ పేరు మీద మండలం కొనసాగడం వల్ల అభివృద్ధికి నోచుకోలేకపోయింది.. స్ధానిక శాసనసభ్యుడు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ప్రత్యేక కృషి మేరకు రఘునాథపాలెం మండలం గా పేరు మార్పు చేయాలని ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్ళలో అసెంబ్లీలో గళమెత్తి ఒక్కో పని చేసుకుని, రఘునాథపాలెం మండలంగా పేరుతో పాటు అన్ని కార్యాలయాలు ఎర్పాటు చేశారు.అందులో భాగంగా మంత్రి పువ్వాడ నేతృత్వంలో ఇప్పటికే మండల పరిషత్ కార్యాలయం మంజూరు చేసి పౌర అందిస్తుండగా ప్రస్తుతం అద్దె భవనాల్లో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యలయంకు నేడు శాశ్వత పరిష్కారం లభించింది.మండలం కేంద్రంలో ఒకే ప్రాంగణంలో రెండెకరాల స్థలంలో రూ.50 లక్షలతో నూతన పోలీస్ స్టేషన్ భవనం, రెండెకరాల స్థలంలో రూ.50 లక్షలతో తహసీల్దార్ కార్యాలయం నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఎంపీలు నామా నాగేశవరరావు , వద్దిరాజు రవిచంద్ర , జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ , పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ సోమవారం శంకుస్థాపన చేశారు

 

ALSO READ :పకడ్బందీగా గ్రూప్1 పరీక్షలు

 

ఒకప్పుడు గ్రామాల్లో తీవ్రంగా ఉన్న విద్యుత్ సమస్యను తెరాస ప్రభుత్వంలో అధిగమించామన్నారు. కరెంట్ ఉందో లేదో తెలియని పరిస్థితుల నుండి నేడు నిరంతర నాణ్యమైన విద్యుత్ ను అందించే స్థాయికి చేరుకున్నామన్నారు.ఖమ్మం చుట్టుపక్కల గల జాతీయ రహదారులు ఏ విధంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఖమ్మం చుట్టు రింగ్ రోడ్ ఏర్పడుతుందని అన్నారు.అదనపు కలెక్టర్ మధుసుధాన్ గారు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం , రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర్లు , జెడ్ పి టి సి ప్రియాంక గ,ఎంపి పిమలోత్ గౌరి , సర్పంచ్ గుడిపుడి శారద తదితులున్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube