పోడుకిశాశ్వత పరిష్కారం కు జిల్లా సమన్వయ కమిటీ 

పోడుకిశాశ్వత పరిష్కారం కు జిల్లా సమన్వయ కమిటీ 

0
TMedia (Telugu News) :

 

పోడుకిశాశ్వత పరిష్కారం కు జిల్లా సమన్వయ కమిటీ                                                                   -పూర్తిస్థాయిలో న్యాయం జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల                                                                  -సమన్వయ కమిటీసమావేశం లో మంత్రి పువ్వాడ

 

            టి మీడియా, సెప్టెంబర్, 23, ఖమ్మం: పోడు భూములను సాగుచేస్తూ, అటవీ హక్కు పత్రాలు పొందని గిరిజన, గిరిజనేతరులకు న్యాయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో పోడు భూములపై సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అటవీ భూముల పరిరక్షణకు, ఆక్రమణలు కాకుండా నియంత్రణకై, పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, జిల్లా మంత్రి అధ్యక్షతన, జిల్లా కలెక్టర్ కన్వీనర్, పోలీస్ కమీషనర్, ఐటిడిఎ పీవో, అదనపు కలెక్టర్లు, జిల్లా అటవీశాఖ అధికారి, డిఆర్డీవో, డిడబ్ల్యుఓ సభ్యులుగా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్ ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా సమన్వయ కమిటీని నియమించిందన్నారు. జిల్లాలో 1,57,531 ఎకరాల అటవీ ప్రాంతం (14.61 శాతం) ఉన్నట్లు ఆయన తెలిపారు. ఐ.టి.డి.ఏ, రెవెన్యూ, అటవీ శాఖలు సమన్వయంతో సంయుక్త సర్వే చేపట్టి అటవీ, రెవిన్యూ భూముల సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. జిల్లాలో 10 మండలాల్లోని 94 గ్రామ పంచాయితీలు, 132 ఆవాసాల్లో పోడు భూముల సమస్య ఉన్నట్లు ఆయన తెలిపారు. పోడు భూముల హక్కులకై జిల్లాలో 18295 దరఖాస్తులు 42,409 ఎకరాలకు సంబంధించి సమర్పించినట్లు ఆయన అన్నారు. ఇట్టి దరఖాస్తులను గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి 2005 సంవత్సరాలకి ముందు నుండి పోడు భూములు సాగుచేస్తున్న గిరిజనులను 75 సంవత్సరాల నుండి పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనేతరులకు సంబంధించిన క్లెయిమ్లను గ్రామస్థాయి కమిటీలో క్లెయిమ్ దారు సమక్షంలో క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టాలని, ఆయా స్థాయి కమిటీలో తీర్మానాలను, రిజిస్టర్లను పక్కాగా నమోదు చేయాలని ఆయన తెలిపారు.

   ALSO READ :చంద్రబాబు నాన్‌ లోకల్‌ : సీఎం జగన్‌

 

                        అటవీ భూములలో పోడు వ్యవసాయం ఎప్పటి నుండి జరుగుతున్నదన్న వివరాలను శాస్త్రీయంగా నిర్ధారించేందుకు శాటిలైట్ మ్యాపుల ప్రకారం సాంకేతికతతో జి.పి.ఎస్. సిస్టం ద్వారా డిజిటల్ సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి, పక్కాగా ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయాలని ఆయన సూచించారు. అర్హులైన ప్రతి దరఖాస్తుదారునికి న్యాయం చేయాలన్నారు. అన్ని వర్గాలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంఘాలు అటవీ పరిరక్షణకు ప్రతిజ్ఞ బూనాలన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, పోడు సమస్య పరిష్కారానికి జాయింట్ సర్వే పెట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. సేద్యమైన భూమికి ఒక హద్దు పెట్టాలని, ఆండ్రాయిడ్ ద్వారా ప్రక్రియ విజయవంతం చేయాలని అన్నారు.ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, పోడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీచేసిందని అన్నారు. అటవీ, రెవిన్యూ శాఖలు సమస్యలు చర్చించుకుని పరిష్కరించాలన్నారు. జిల్లాకు మంచి పేరు ఉందని, ఈ విషయములో కూడా మంచి పేరు కాపాడుకోవాలని అన్నారు.సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఒక మంచి విజన్తో పోడు భూముల సమస్య ముగింపుకు చర్యలు చేపట్టారని అన్నారు. అందుకు అనుగుణంగా అడవుల పరిరక్షణ, వాతావరణ సమతుల్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అమలుచేయాలన్నారు. అధికారులకు క్షేత్ర పరిధిలో చేపట్టాల్సిన చర్యలపై పూర్తి స్పష్టత ఉండాలని, సాంకేతిక సమస్యలు ఉండకూడదని అన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిఒక్కరూ బాధ్యతగా మెలగాలని ఆయన తెలిపారు. చట్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. అందరం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 

ALSOREAD :అక్రమార్కుల నుండి చెరువులను కాపాడండి

మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ, . దరఖాస్తుల రాజకీయ ప్రమేయం లేకుండా పరిష్కరించాలన్నారు.సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, అటవీ భూములకు హద్దులు పెట్టాలనిఅన్నారు. పూర్వం భూములకు పట్టాలు వుండి, ఎల్.ఆర్.యూ.పి అప్పుడు అటవీ శాఖ అభ్యంతరాలు వచ్చాయని వీటిని పరిష్కరించాలని అన్నారు. పోడు భూముల ప్రక్రియకు కాలపరిమితి పెట్టి, ఆ సమయంలోగా పరిష్కరించాలని అన్నారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మాట్లాడుతూ, పోడు భూముల సమస్య తననియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నట్లు, త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, భద్రాచలం ఐటిడిఎ పీవో గౌతమ్ పోట్రూ, అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అదనపు డిసిపి బోస్, డిఆర్డీవో విద్యాచందన, డిటిడబ్ల్యూఓ కృష్ణా నాయక్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube