క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి

-క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి

0
TMedia (Telugu News) :

 

టీ మీడియా, జనవరి 7, వనపర్తి :పట్టణంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రిబ్బన్ కట్ చేసి వనపర్తి ముఖచిత్ర క్యాలెండర్ విడుదల చేశారు. మరియు మాజీ ఎమ్మెల్యే అయిన కీర్తిశేషులు జయరాములు కుమారుడు శ్రీనివాసులు డి.ఈ మరియు వారి కుమార్తె అయిన శ్రీమతి భరణి కూతురు మరియు సర్పంచ్ అయిన జయంతి మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప కుటుంబంలోని మాజీ జెడ్పిటిసి మున్సిపల్ చైర్మన్ అయిన సుకేశిని విశ్వేశ్వర్ విడివిడిగా ఆవిష్కరణలు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకృష్ణయ్య కుటుంబం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ దీని ఉద్దేశ్యం ఏమిటంటే వనపర్తి చరిత్రను వనపర్తి రాజులు వనపర్తి రాజకీయంగా ఏలిన ఎమ్మెల్యేల చరిత్ర వనపర్తి ఆధ్యాత్మక చరిత్ర జిల్లా చరిత్ర మాకు తెలిసినంత వరకు ప్రజలకు తెలియజేయాలని కోరుతూ ఈ చిన్న ప్రయత్నం చేశాము. పార్టీలకు అతీతంగా అందరి ఎమ్మెల్యేల ద్వారా వారి కుటుంబాల ద్వారా క్యాలెండర్ ఆవిష్కరణ చేయాలనుకున్నాం కానీ కొందరు అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోవడం వలన ఉన్నంతలో ఉన్న వారిచే క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మా చిన్ని ప్రయత్నాన్ని వనపర్తి ప్రజలందరూ ఆదరిస్తారని కోరుతూ ప్రజలందరికీ నూతన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ ,వెంకటేష్ వైయస్సార్, టిడిపి కార్యవర్గ సభ్యులు బాలరాజు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube