కొత్తకోటలో బిస్పీ పార్టీలో మైనార్టీ మహిళలు చేరిక
– పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సంతోష్ రెడ్డి
టీ మీడియా, నవంబర్ 18, కొత్తకోట: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, కొత్తకోట మండలంలో మైనార్టీ యువతీ, యువకులు జాయిన్ అయ్యారు. దేవరకద్ర అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి బసిరెడ్డి సంతోష్ రెడ్డి, పార్టీలో జాయిన్ అయిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళలు మాట్లాడుతూ, బహుజన సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి పార్టీలో జాయిన్ అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బసిరెడ్డి సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, ఈ 2024 ఎన్నికలు ఆధిపత్య పార్టీల గెలుపు ఓటములను, నిర్దేశించె స్తాయికి ఎదుగుతున్నబహుజన సమాజ్ పార్టీ ప్రచార భాగంలో గ్రామాల్లో మంచి స్పందన ఉందని, బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే దేవరకద్ర గడ్డపై బీఎస్పీ పార్టీ గెలవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. నిశ్శబ్దం, నిజాయితీ, ఓటు బ్యాంకు, బిఎస్పి సొంతం అని బసిరెడ్డి సంతోష్ రెడ్డి అన్నారు. బహుజన వర్గాలు అన్ని ఆలోచనలో పడి ఈసారి, మా ఓటు బహుజన అభ్యర్థి కె, అని లోపల ప్రచారం జరుగుతుంది అనే మాట పక్కన పెడితే, దేవరకద్ర నియోజకవర్గం లోని ప్రజలు బీఎస్పీ పార్టీకే మద్దతు తెలియజేస్తున్నట్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారని అన్నారు.
Also Read : జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో బూతు కమిటీ సమావేశం
ఇదే కనుక జరిగితే రానున్న రోజుల్లో బలమైన పార్టీగా, ఎదురులేని పార్టీగా, బహుజన సమాజ్ పార్టీ ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఫాతిమా బేగం దేవరకద్ర మహిళా కన్వీనర్, జిల్లా ఉపాధ్యక్షులు సంధ్యపాగా మాసన్న, అసెంబ్లీ కార్యదర్శి చిన్న కురుమన్న, మదనాపురం మండల అధ్యక్షుడు బురాన్, కొత్తకోట పట్టణ మైనార్టీ కన్వీనర్ ఎండి. గౌస్, చింతకాయ రాములు జనరల్ సెక్రెటరీ, బాలయ్య మండల ట్రెజరర్, రవీందర్ సిసి కుంట అధ్యక్షుడు, జి. సాగర్ దేవరకద్ర బిఎస్పి అధ్యక్షుడు, సంతోష్ కౌకుంట్ల అధ్యక్షుడు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube