కశ్మీర్లో గజగజ.. లడాఖలో మైనస్ 29 డిగ్రీలు
కశ్మీర్లో గజగజ.. లడాఖలో మైనస్ 29 డిగ్రీలు
కశ్మీర్లో గజగజ.. లడాఖలో మైనస్ 29 డిగ్రీలు
టీ మీడియా, జనవరి 17, శ్రీనగర్ : కశ్మీర్ లోయ గజగజ వణికిపోతోంది. అక్కడ ఉష్ణోగ్రతలు అతిశీతలంగా మారాయి. లడాఖ్‌లోని ద్రాస్ పట్టణంలో మంగళవారం మైనస్ 29 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. లోయల్లో కోల్డ్ వేవ్ కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. శ్రీనగర్ పట్టణంలో నల్లాలు గడ్డకట్టుకుపోయాయి. రాబోయే 24 గంటల్లో జమ్మూలో ఆకాశం క్లియర్‌గా ఉంటుందని వెదర్ శాఖ తెలిపింది. శ్రీనగర్‌లో మైనస్ 2.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. పహల్గామ్లో మైనస్ 11.8, గుల్మార్గ్లో మైనస్ 11.5 డిగ్రీలు నమోదు అయ్యాయి. కార్గిల్‌లో మైనస్ 20.9, లేహ్‌లో మైనస్ 15.6 డిగ్రీలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.