టీ మీడియా చింతకాని
చింతకాని మిరప తోట సాగు చేసిన రైతులు ఈ సంవత్సరం మిరప పంటకు నల్లి రూపంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవాపురం సర్పంచ్ కొండపర్తి గోవిందరావు అన్నారు మండల పరిధిలోని కోమట్ల గూడెం నా గిలి గొండ ప్రొద్దుటూరు గ్రామాలలో మిరప తోటలను రైతు సంఘం నాయకులు రైతులతో కలిసి పరిశీలించారు సందర్భంగా ఈనెల 28వ తారీఖున హైదరాబాదులోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని మండలంలోని రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు మిరప పంట నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి మిరప సాగు చేసిన ప్రతి రైతుకు ప్రభుత్వం లక్ష్య రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఏపూర్ రవీంద్ర బాబు ఏ ఐ వై ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి మహేష్ రైతు సంఘం జిల్లా సమితి సభ్యులు padhimala వెంకట నరసయ్య నాయకులు ఎస్కే జానీ పీర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.