0
TMedia (Telugu News) :

సిరులు కురిపిస్తున్న మిర్చి..

-క్వింటాకు రూ.90,000 పలికిన ధర..

టీ మీడియా,సెప్టెంబర్ 29,హనుమకొండ : మిర్చి రైతులపై కనకవర్షం కురుపిస్తోంది. ధరలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఎర్ర బంగారం ధర ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకుంది. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో దేశీ మిర్చి ధర ఏకంగా రూ. 90 వేలకు చేరుంది. మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర అని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబత్ పల్లికి చెందిన అశోక్ అనే రైతు.. తాను పండించిన మిర్చిన మార్కెట్‌కు తీసుకొచ్చాడు.

Also Read : శంకుస్ధాపనలు, ప్రారంబోత్యవాలు చేసిన మంత్రి పువ్వాడ

ఈ మిర్చిని మాధవి ట్రేడర్స్కు విక్రయించగా…లక్ష్మీ సాయి ట్రేడర్స్‌ క్వింటాల్‌కు రూ.90 వేలు చెల్లించి కొన్నది. అయితే ఆశోక్‌ తీసుకొచ్చిన మిర్చిలో ఒక్క బస్తాకు మాత్రమే రూ. 90 వేలు పలికింది.మిగతా బస్తాలకు మాత్రం సాధారణ ధరలే చెల్లించారు. క్వింటాల్ మిర్చికి రూ. 90 వేలు పలకడంపై రైతు ఆశోక్ సంతోషంతో ఆనందం వ్యక్తం చేశాడు. జులైలో వరంగల్ ఎనుమాముల మార్కెట్లో వండర్ హాట్ రకం మిర్చికి.. క్వింటాల్‌కు రూ. 32,500 ధర పలికిన విషయం తెలిసిందే. సెప్టెంబర్లో అత్యధికంగా రూ.35,500 పలికింది. తాజాగా ఈ రికార్డు బద్దలైంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube