సమాజంలో వికలాంగులను ఆదరించాలి

0
TMedia (Telugu News) :

-జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబ శివ రెడ్డి

టక మీడియా,డిసెంబర్ 3,పినపాక:

సమాజంలో వికలాంగులను గుర్తించి ఆదరించాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు.
శుక్రవారం డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా సరిహద్దు గ్రామమైన టీ కొత్తగూడెం గ్రామంలోని సాధనపెల్లి అచ్చయ్య అనే నిరుపేద దళితుడు ఇటీవల అనారోగ్యానికి గురై రెండు కిడ్నీలు చెడిపోవడంతో రెండు కాళ్లు పని చేయకుండా పూర్తిగా వికలాంగుడిగా మారాడని ,ఇలాంటి పరిస్థితుల్లో నిరుపేద దళితుడైన సాధన పెళ్లి అచ్చయ్య కు వికాస్ అగ్రి ఫౌండేషన్ నుండి 7000 రూపాయులు విలువైన వీల్ చైర్,1500 నగదును అందజేయడం జరిగిందని సాంబశివ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాధనపెల్లి లాలమ్మ, యలందాసరి ముత్తయ్య,తిరుపతి రావు,శేషారెడ్డి, స్వామి,బాబు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube