హైదరాబాద్ యువతి మిస్సింగ్.

మావోయిస్టులపై కిడ్నాప్ కేసు

1
TMedia (Telugu News) :

హైదరాబాద్ యువతి మిస్సింగ్.

మావోయిస్టులపై కిడ్నాప్ కేసు

టి మీడియా, జూన్14, హైదరాబాద్‌: యువతి మిస్సింగ్ కావడంతో మావోయిస్లుల పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు ఎన్ఐఏ అధికారులు. 3.5 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి చెందిన యువతి రాధ అదృశ్యం అయింది. ఈ నేపథ్యంలోనే చైతన్య మహిళా సంఘంకి చెందిన దేవేంద్ర, దుబాసి స్వప్న, చుక్కా శిల్ప లు కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు చేసింది తల్లి పల్లెపాటి పోచమ్మ.

Also Read : భక్తజనంతో కలకలలాడుతూన్న మహానంది క్షేత్రం

2017 డిసెంబర్ లో నర్సింగ్ కోర్సు చేస్తున్న తన కుమార్తెను కిడ్నాప్ చేసి ఏఓబి లోని పెద్దబయలు లో ఉంచారంటూ విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసారు విశాఖ పోలీసులు. 2022 మే 31 న కేసు రీఓపెన్ చేసి దర్యాప్తు చెయ్యాలంటూ ఎన్ఐఏకి కేంద్ర హోంశాఖ ఆదేశాలు చేసింది.

Also Read : నేషనల్‌ హెరాల్డ్‌ కేసు: -రాహుల్‌ గాంధీ ఈడీ విచారణ..

అదృశ్యమైన రాధ తల్లి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఐఏ దేవేంద్ర ,దుబాసి స్వప్న, చుక్కా శిల్ప లు తో పాటు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు గాజర్ల రవి, అరుణ లను నిందితులుగా చేర్చింది. మావోయిస్టు పార్టీ నేతలకు చికిత్స చేయించడం కోసమే రాధను కిడ్నాప్ చేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొంది ఎన్ఐఏ.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube