వర్షంలో ను మిషన్ భగీరథ కార్మికులు దీక్ష

సంఘీభావం తెలిపిన జడ్పిటిసి శ్రీనువాస్ 

2
TMedia (Telugu News) :

వర్షంలో ను మిషన్ భగీరథ కార్మికులు దీక్ష

-సంఘీభావం తెలిపిన జడ్పిటిసి శ్రీనువాస్

టీ మీడియా ,జులై 22 ,తిరుమలాయపాలెం :

జోరు వర్షంలో సైతం మిషన్ భగీరథ కార్మికులు వర్షంలో తడుస్తూ మండల పరిధిలోని దమ్మాయిగూడెం వద్ద దీక్ష నిర్వహించారు దీనికి జడ్పిటిసి బెల్లం శ్రీను వాస్ సంఘీభావం తెలపగా అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ. పథకంలో ఖమ్మం జిల్లాలో సుమారు 500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారికి అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ వెట్టిచాకిరి చేపియ్యాడమే కాక గత మూడు నెలలుగా రావలసిన వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గుడి చేస్తుందని అన్నారు. మండల పరిధిలోని మాద్రి పురం మిషన్ భగీరథ ప్లాంటేషన్ వద్ద కార్మికులు మౌన దీక్ష చేశారు.

 

Also Read : 31న కానిస్టేబుల్ మోడల్ పరీక్ష

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ కార్మికులను వారి కుటుంబాలను అనేక భాధలకు గురి చేస్తుందని అలాగే కార్మికులకు రావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పించకుండా కంపెనీలు శ్రమ దోపిడీ చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి కార్మికులకు తగు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. వారికి వేతానాల నిలిపి వేసినందుకు నిరసనగా గత రెండు రోజుల నుండి విధులను బహిష్కరిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో TRSKV కార్మిక విభాగం జిల్లా ఖమ్మం జిల్లా సబ్ డివిజన్ కార్యదర్శి గొర్రెపాటి రవీందర్ , నందిపాటి మల్లికార్జున్, ఉప్పునూతల ఉపేందర్, ధరావత్ కిషన్, వెంకన్న, ప్రభాకరు, మహేష్, రవి, అనిల్ , సైడ్ మీర్,కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube