మీషన్ భగీరథ పనులు పూర్తిచేయాలి:కలెక్టర్ విపి గౌతమ్
టీ మీడియా, మార్చి 31, ఖమ్మం:మిషన్ భగీరథ కింద నగరంలో పురోగతిలో ఉన్న మంచినీటి పథకాల పనులను త్వరగా పూర్తి చేసి వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం డి.పి.ఆర్.సి భవనంలో నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న మిషన్ భగీరథ, గోళ్ళపాడు చానల్, సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అల్లీపురం, గోపాలపురం, బాలపేట, ఖానాపురంహావేలి, కైకొండాయి గూడెంలలో పురోగతిలో ఉన్న మంచినీటి ట్యాంకుల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Also Read : విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నిరసనలు.
అదేవిధంగా ఏప్రియల్ నెలాఖరులోగా గోళ్ళపాడు చానల్ పనులన్నీ పూర్తి కావాలని, ఇప్పటికే పైస్లెన్ పనులు పూర్తయిన జూబ్లిపుర, రంగనాయకుల గుట్ట ప్రాంతాలలో ఇరువైపుల ఫెన్సింగ్, చైల్లింక్ మెష్ పనులను పూర్తి చేసి పబ్లిక్ పార్కులు, ఆటవిడుపు పరికరాలు, ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. దీనితోపాటు సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను కూడా వేగవంతం చేయాలని, డ్రైనేజ్ పనులను ముమ్మరం చేసి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు కృష్ణలాల్, డి.ఇ రంగారావు, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు రంజిత్ కుమార్, ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాద్, అర్బన్ తహశీల్దారు శైలజ, ఎల్. అండ్.టి ఏజెన్సీ బాధ్యులు హరిప్రసాద్, హన్మంతరామ్ ఏ, ఇ.లు, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube