కార్యాలయం ముందు ధర్నా చేసిన నాయకులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 31 వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథలో ధ్వంసం అయిన అంతర్గత సీసీ మరియు బి.టి రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు వెంటనే మంజూరు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం మిషన్ భగీరథ కార్యాలయం ఎదుట ధర్నా నిరసన వ్యక్తం చేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ డివిజన్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ.ఈ అందుబాటులో లేకపోవడం వల్ల ఏ.ఈ చంద్రశేఖర్ కి నందిమల్ల అశోక్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి దస్తగిరి, యువత రాష్ట్ర కార్యదర్శి రవియాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నందిమల్ల రమేష్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎండీ గౌస్, మరియు పట్టణ నాయకులు పి బాలయ్య, ఆవుల శీను, వహీద్, డి.బాలరాజు, ఎండి ఖాదర్, కొత్త గొల్ల శంకర్, ఫారూక్ తదితరులు పాల్గొన్నారు.

Telugu Desam Party leaders staged a dharna in front of the Mission Bhagiratha office on friday.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube