టీ మీడియా,డిసెంబర్,9, భద్రాచలం
బూర్గంపాడు మండల పరిధిలో సారపాక సుందరయ్య నగర్ లో మిషన్ భగీరథ మంచినీళ్లు 30 కుటుంబాలకు పూర్తిగా రావడం లేదు గతంలో వేసిన పైప్ లైన్ భూమిలో పూర్తిగా మునిగిపోయాయి.వాటి ద్వారా మంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు ఇంటికి పైపులైను నల్ల పెట్టారు కానీ మంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు.వెంటనే అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.మంచి నీరు సమస్య మిషన్ భగీరథ పైపులు త్వరగా చేయకపోతే అవసరమైతే గ్రామ పంచాయతీ ఆఫీసు ముందు టెంట్ వేసుకొని సమస్య పరిష్కారం అయ్యేంతవరకు లేచేది ఉండదన్నారు.జిల్లా కలెక్టర్ కి కూడా విన్నపం చేస్తున్నాం వేసవికాలం మంచినీటి సమస్య తీవ్రంగా ఉంటే పరిస్థితి వస్తుందని అందుకోసం ఆ కుటుంబాలకు మిషన్ భగీరథ పైప్లైన్ వేసి మంచినీరు అందించాలని కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో విలాసాగర్, రజిని,స్వరూప, రమా, కృష్ణవేణి,పాపినేని చందర్రావు, భవాని తదితరులు పాల్గొన్నారు.